పుట:2015.372412.Taataa-Charitramu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డగు తాతా యట్టి ప్రయత్నము చేయలేదు. సంఘీభావము బలము. మనవర్తకు లేకీభవించినచో, దేశీయవర్తకము సురక్షితమై జయప్రదమగునని, లేనిచో చెడునని, తాతాగారి యా యుద్యమముచే స్పష్టమయ్యెను.

తరువాత 1908 ప్రాంతమున దక్షిణమున 'తూత్తుకుడి'కి సింహళముకు మధ్య చిదంబరపిళ్ళగా రిట్లే యొక దేశీయ నౌకాసంఘమును బెట్టి, ఓడలనడిపిరి. అచ్చటను, అట్లే బ్రిటిషు నౌకాసంఘమువా రాపోటీ పడగొట్టుటకై తమ కేవులను విపరీతము తగ్గించగా, ఆకంపెనీయు తాళలేక నశించెను.

ఇప్పుడు మన భారతీయవర్తకులలో కొంత జ్ఞానమును, దేశమున జాతీయభావమును, వ్యాపించియున్నవి. అందుచే తాతాకుటుంబీయులును, వారి మిత్రులగు కొందరు పెద్దవర్తకులును కలసి బొంబాయిలో 'సిందియా స్టీంనావిగేషన్ కంపెనీ^' అనుపేర నొక పెద్ద నౌకాసంఘము నిటీవల స్థాపించి, కొన్నియేండ్లనుండి నడుపుచున్నారు. కొందరు సంస్థానాధీశులును, ఇతర శ్రీమంతులును, దీనిలో వాటాలదీసికొని సహాయము చేసిరి. తగినంత ప్రభుత్వప్రోత్సాహము లేకున్నను, ఇప్పుడీ నౌకాసంఘము వృద్ధిలోనే యున్నది. ఈసంఘమువారు గొప్ప పొగయోడల గొనిరి, కొన్నింటిని కట్టించిరి. జలదుర్గ, జలదూత, జలవిహార, మున్నగు పేర్లుగల యానౌక లిప్పుడు మనదేశపుతీరములం దంతటను చీనా జపానుప్రాంతములకును