పుట:2015.372412.Taataa-Charitramu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారి సహాయముతో, ప్రతిసాలున, అఖిలభారతపారిశ్రామిక మహాసభ జరుపబడుచుండెను. *[1] 1915 లో జరిగిన పారిశ్రామికమహాసభ సర్ దొరాబ్జితాతాగారి అధ్యక్షతనే మహోత్సాహముతో నడిపింపబడెను. దొరాబ్జితాతాకును విద్యాసక్తి యధికమే. తాను విద్యనభ్యసించిన కేంబ్రిడ్జిలో పరిశోధనల జరిగించుట కావిశ్వవిద్యాలయమున కాయన 25000 పౌనుల నిచ్చెను.

ఇట్లు తండ్రిపరిశ్రమల జరిపి, మరికొన్ని కొత్తపరిశ్రమలగూడ స్థాపింప దోడ్పడి, దొరాబ్జితాతా 1932 లో కాలము చేసెను. పోవుటకుముందు తనఆస్తిలో విశేషభాగము నొక ధర్మనిధిగ నేర్పర్చి, ఆద్రవ్యమును కొందరు ట్రస్టీలద్వారా చాల ఆర్ధికసాంఘికధర్మ కార్యములకు వినియోగించుటకు నిర్ణయించెను. ఆసంస్థ 'సర్ దొరాబ్జితాతాట్రస్టు' అనుపేర బొంబాయిలో పనిచేయుచున్నది. వారిసహాయమున బొంబాయిలో సాంఘికశాస్త్రబోధకు పరిశోధనకు ప్రత్యేక విద్యాలయము స్థాపింపబడినది.

లోగడ వివరించినవానినేగాక, దరిమిలాను తాతాకంపెనీవారు మరికొన్ని పరిశ్రమలనుగూడ స్థాపించినారు. ఈకాలమున పాశ్చాత్యదేశములందు మెకానికల్ ఇంజనీరింగు

  1. * కొన్నియేండ్లనుండి ఆసభ ప్రతిసంవత్సరమును కాంగ్రెసుతో సంబంధములేకుండ నేరుగా జరుగుచున్నది.