పుట:2015.370800.Shatakasanputamu.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

412

భక్తిరసశతకసంపుటము


ప్రియమునఁ గ్రోలి కూల్చి దయపెంపున నైక్య మొసంగె నేమివిం
తయొ తలపోసి శ్రీహరి...

39


చ.

మదమునఁ గాలనేమి హనుమంతునిచే హతుఁ డౌచు ద్వేషిగాఁ
బదపడి కంసుఁడై పొడమి పంకజనాభునిఁ జేరె మాయురే!
యదనుస భక్తినైనఁ బగనైనను బన్నగతల్పుఁ గోర భ
ద్రదమగు గాన శ్రీహరి...

40


ఉ.

[1]ధాతృశిరోవిఖండనకృతంబున ద్రౌపదిగా నొనర్చి యా
నాతికి దుష్టి దీఱగ రణస్థలి కౌరవసేన నిచ్చి బల్
జాతర జేసి రుద్రగతజాడ్యము బాపితి వీవ హేజగ
త్త్రాత యటంచు శ్రీహరి...

41


చ.

చతురత గాధినందనుని జన్నము గాచె నహల్యశాప మా
తతమునఁ బాపె నాజటలతన్వికి మోక్ష మొసంగె నత్యుదం
చితముగ సర్వలోకములు జేకొని యేలినదేవదేవుఁ డు
ద్ధతి నినుఁ బ్రోచు శ్రీహరి...

42


ఉ.

గోరిక దీఱ నొక్కపరి కోమలసౌరభపుష్పదామముల్
గూరుప మాలికు న్మనిచెఁ గొంగుపసిండిగ మోక్ష మిచ్చి య

  1. ఈకథ పురాణాంతరములవలన దెలిసికొనవలయును. భారతాదులలో మృగ్యము.