పుట:2015.333901.Kridabhimanamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బయికి బరమవేతాంతములు పలుకుచు గాషాయముల దాల్చి సన్యాసివేషములతో గొందఱు పయోముంఆవిషకుంభములువోలె లోకమును మోసగించుచుందురు. తారతి సచ్చరిత్రులయ్యును కొందఱు పయికి దుశ్చరిత్రులువోలె దోచునట్లు ప్రవరీంచుచుందురు. తమ సచ్చరిత్రభంగమును జాటుసేయక సంతాపముతో వెల్లడించుకొనుచు గొందఱు కుందుచుందురు. తమ తప్పిదములను దప్పిదములుగాగూడ దలపక్ కొందఱు కొండాడుకొనుచుందురు. తప్పిదముల బలములుగూడ గాలభేదములబట్టి తార్మారగుచుండును. ఒక కాలమున బ్రబలముగా దలపడు తప్పిదము కాలాంతరమున దుర్భలముగాను, ఒప్పిదముగాను గూడ దలపబడుటయు గలదు. లోక మింత వింతతీరు గలది.

      శ్రీనాధుడు సుఖదు:ఖములను, లాభనష్టములను, మానావమానములను దనకు దటస్థించినవానిని జాటుసేయక చాటిచెప్పుకొనుస్వభావము గలవాడు.  తన గృహచ్చిద్రములను, దేశాటన క్లేశములను, దారిద్ర్యమును, వానివలని యవమానములనుసుప్రభాతడు కలకాలము దెలియదగునట్లు కవితలో వెలదిగాజెప్పుకొన్నాడు.  నేల పన్ను నీయజాలకపోగా రాచవారు నగరివాకిట నిలబెట్టి భుజముపై నల్లగుండు మోపుటను, చేతులకు వెదురు