పుట:2015.328620.Musalamma-Maranam.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
17
ముసలమ్మ మరణము


వ. అని యుల్లసమాడి యొక్కింత చింతించి యిట్లనియె. 71

గీ. నీవు చెప్పినదెల్లను నిక్కువంబ
యయిన మనమున కారాట మయ్యెఁ దరుణి
యింతయే కాని యచ్చెరు వింతలేదు
మున్ను తలఁచినదే నేఁడు మొనసెఁ గాన. 72

క. విను ఇచ్చకంబులాడను;
జను లెల్లరు నాడుకొనెడు సంగతి; మాకం
టెను నీవు నూఱు మడుఁగులు
ఘనతరవని బుద్ధి భక్తిఁ గారుణ్యములన్‌. 73

క. తెలియును నాకునునీవ
న్యులఁబోల వనియును, గొప్ప యొప్పిదములకున్‌
నెలవ వనియు, నే నీకుం
జలజానన తగననియును సత్యము గాఁగన్‌. 74

సీ. అరుణోదయ చ్ఛాయ లాకాశ పథమున
              నంభోధరముల వేటాడువేళ
మార్తాండ చండాత పార్తికి ననిలముల్‌
              పొదరిండ్ల గుసగుసల్‌ వోవువేళ
సాయాహ్నలక్ష్మి కసూయ కలుగు భూమి
              తళుకు విరుల చీరఁ దాల్చువేళఁ
బండువెన్నెల ఱేఁడు కొండపైజలజల
              మని పాఱు నది తాన మాడువేళఁ
 
తే. గల మనోహరాకృతులెల్లఁ గాంచి నీవు
               చొక్కి మ్రొక్కు నిక్కుం గాంచి “యొక్కనాఁడు