1857: ముస్లింలు
తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ తిరుగుబాటు తెలుగు గడ్డ మీద జరిగిన విషయంగానీ, ఆ తిరుగుబాటు మన తెలుగు బిడ్డడి నేతృత్వంలో జరిగిందన్న విషయంగానీ మన చరిత్ర గుర్తు చేయదు. ఆ ఉదాంతాలు, ఆ చారిత్రక సంఘ టనల నిర్మాతల పట్ల ప్రభుత్వాలకు శ్రద్ధలేదు , ప్రబు త్వాధి నేతలు పపట్టించుకోరు.ఆ ఘన చరిత్ర ప్రజలకు తెలియదు. ఆ కారణంగా ఆ యోధుల సాహసోపేతమైన పోరాటం, ఆ పోరాటయోధుల చరిత్రలు మరుగున పడిపోతున్నాయి.
- విశాఖపట్నం యోధుల తిరుగుబాటు
తెలుగునాట సిపాయీల తిరుగుబాటు 1780 అక్టోబరు 3న విశాఖపట్నంలో జరిగింది. ఉత్తరాంధ్రలో ఎదురు లేకుండా పెత్తనం చేస్తున్న ఆంగ్లేయులు ఈ పోతుగడ్డ చావు దెబ్బను తొలిసారిగా చవిచూశారు. స్వాభిమానానికి మారుపేరైన ఉతరాంధ్ర కొదమ సింహాలు జబ్బచరిచి బొబ్బరించిన ఈ తిరుగుబాటుకు ఈస్ట్ ఇండియా కంపెనీలో సుబేదారుగా పనిచేస్తున్న షేక్ అహ్మద్ (షేక్ ముహమ్మద్) నాయకత్వం వహించారు. ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యక్తిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఇ.వి. గంగాధరం (Director, Centre For Marine Archaeology) కథనం.
1780లో స్వదేశీయోధుడు హైదర్ అలీ ధాటిని ఎదుర్కొడానికి, ఆయన సైన్యాల మీద దాడులకు ఆంగ్లేయులకు అదనపు సైన్యం అవసరవుంది. మచిలీపట్నం, ఏలూరు, విశాఖపట్నంలలో గల కంపెనీ సైనికులను 1780 అక్టోబరు 3న మద్రాసుకు తరలించేందుకు ఆంగ్లేయాధికారులు ప్రయత్నించారు. ఆ బలవంతపు ప్రయత్నాల ఫలితంగా స్వదేశీ సిపాయీలలో నివురుగప్పిన నిప్పులాగున్న అసంతృప్తి మరింతగా పెరిగి తిరుగుబాటు మార్గం పట్టింది.
ఈస్ట్ ఇండియా కంపెనీ విశాఖపట్నం సైనిక స్థావరంలో సుబేదార్‌గా బాధ్య తలు నిర్వహిస్తున్నషేక్ అహ్మద్ నాయకత్వంలో స్వదేశీ సైనికులు తిరుగుబాటు బావుటాను వినువీధుల్లో ఎగురవేశారు. ఈ అనూహ్య పరిణామాలతో ఖంగుతిన్నఅధికారులు కకావికలయ్యారు. ఈ తిరుగుబాటులో కొందారు అధికారులు స్వదేశీ యోధుల తుపాకి గుళ్ళకు బలయ్యారు. స్వదేశీ యోధు ల ధాటికి తట్టుకోలేక ఆంగ్లేయాధికారులు పలాయనం
136