1857: ముస్లింలు
ఖాన్ ఆనాటి రాజకీయ పరిస్థితులను వివరిస్తూ, స్వదేశీ పాలకులు, ప్రజలు ఎందువల్లఐక్యంగా ఆంగ్లేయుల మీద ధ్వజమెత్తాల్సివుందో వివరించారు.
ఇంగ్లాండు తదితర ప్రాంతాల పర్యటనల సందర్భంగా ఆయన సంపాదించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, రహస్య సంకేతాలతో ప్రత్యేక లేఖలను తయారు చేసి స్వదేశీ పాలకులకు పంపారు. ఆ లేఖలు శత్రువు చేతబడినా ఉద్యమానికి, ఉద్యమకారులకు ఎటువంటి నష్ట కలుగకుండా ఆయన సాంకేతికంగా పలు జాగ్రతలు తీసుకున్నారు. ఆ ఉత్తరాలు భారతీయ రాకుమారుడి లేఖలు గా ప్రచురితమై విఖ్యాతిగాంచాయి. అజీముల్లా ఖాన్ రెండవ బాజీ రావు, నానాసాహెబ్ దర్బారులోని రోజువారి వ్యవహరాలను కూడా ప్రత్యేక డైరీలుగా రాయించారు. ఆనాటి రాజకీయ వాతావరణంతో పాటుగా, ప్రజల జీవితాల గురించి తెలుసుకోవటానికి ఆయన రాసిన డైరీలు, లేఖలు చరిత్రకారులకు ఎంతగానో ఉపయోగపడ్ఢాయి.
ప్రపంచ పర్యటన సందర్భంగా గమనించిన అక్షర ప్రచార ప్రాముఖ్యత, ప్రజల మీద పత్రికల ప్రబావం బాగా తెలిసిన వ్యకిగావడంతో అజీముల్లా ఖాన్ పయామే ఆజాది పత్రికకు అంకురార్పణ చేశారు. ఈ పత్రికను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి జవజీవాలు అందించడానికి ఎనలేని కృషి చేశారు. ఆ పత్రికలో '..భారతీయ హిందువులారా, ముస్లింలారా లేవండి. సోదరు లారా లేవండి. దైవం మనిషికి ఎన్నోవనరులను ఇచ్చాడు. అందులో విలువైనది స్వాతంత్య్రం..' అంటూ మొగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ జారీ చేసిన ప్రకటనను ప్రచురించారు. హిందూ-ముస్లిం తేడాలను పూర్తిగా విస్మరించి ఉమ్మడి శత్రువు మీద యుద్ధానికి కదలి రమ్మని ప్రజలను, స్వేచ్ఛా-స్వాతంత్య్రాల కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో పాల్గొనాల్సిందిగా వివిధ ప్రాంతాలలోని స్వదేశీ పాలకులను, స్వదేశీసైన్యాధికారులను, సైనికులను బహుదాూర్‌షా జఫర్ ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.
మాతృ దేశాన్ని కీర్తిస్తూ, బానిస బంధనాల నుండి విముక్తి కోసం పోరుబాటలో ముందుకు సాగమంటూ దేశ ప్రజలను కోరుతూ రాసిన ఉత్తేజపూరిత 'పైగాం-యే-అమల్' అను ప్రబోధ గీతం పయామే ఆజాది లో ప్రముఖంగా ప్రచురితమైంది. ఈప్రబోధ గీతాన్నిమౌల్వీ లియాఖత్ అలీ రాశారు. ఆయన 1857లో ఆయుధంతో అటు
128