24
కాళిదాస చరిత్ర
నీకు మృత్యువాసన్నమైదా యేమి? కండకావరమున నొడలెఱుగక ముప్పదిమూడుకొట్ల దేవతలను బలుబాములు బెట్టిన మహిషాసురుని మర్దించిన మహాకాళిని నన్నెఱుగవుకాబోలు! దేవాంతక నరాంతకులైన దైత్యదానవయక్షరాక్షస ప్రముఖులే నాయెడల నిలువలేరు. నీవెంత? బ్రదుకదలంచితివేని తక్షణము తలుపుదీయుము" అని జంకించుటయు, నాబ్రాహ్మణకిరాతకుడు నదరుబెదురులేక "తల్లీ ! నాకు బిద్దెనిమ్ము, తలుపుతెరిచెదను" అని బదులుచెప్పెను. "బిద్దెలేదు, నీమొగములేదు తలుపుదీయు" మని యాదేవి మరల గంభీరముగ బలికెను., "బిద్దె యిచ్చినగాని తలుపుదీయ" నని యతడు ప్రత్త్యుత్తరమిచ్చెను. అంతలో జాముకొడి కూసెను. తెల్లవాఱునట్లు చెన్నెలగుపడుచుండెను. ప్రయాణము చేయదలచువారు, పొలములకు బోదల చువారును. నిద్రమేలుకాంచి బైలుదేఱుచుండిరి. నిజమూర్తి జనులకు గనబడకుండ బెందలకడ నాలయము బ్రవేశింపవలెనని తలంచి కాళి "ఓరీ! బెద్దె యిచ్చెద తలుపుసందునుండి నీనాలుక చాపుము" అని కంచెకోలతో వాని నాలుకపై సకల విద్యాబీజములగు నక్షరంబుల వ్రాసెను. అంతట నతడు తలుపులు దీసెను. మహాకాళియు నిద్రమందిరము బ్రవేశించి కోపాగ్నిచేరవులుచున్న కొలుములో యనునట్లు నెఱ్ఱగానున్న కన్నులతొ వానింజూచి "పాపాత్మా ! పలుగాకి ! యెవడవురా నీవు! నామందిరద్వారముమూసి బలవంతముగా నాచేత వరములు బడయదలచితివా? ఇదిగొచూడు! నీమేషకాలమాత్రమున మహిషాసుర ప్రముఖులు పోయిన మార్గమున నిన్ను బంపెద" నని వాని నెత్తి వణచుటకు దనహస్త మెత్తెను. దేవీ బీజాక్షరములు జిహ్వగ్రమున వ్రాసినతొడనే యాతని మౌడ్యమంతయు నాశనమయ్యెను. కుబుసము విడిచిన పామువలె నాతనిమనస్సు నవసన వికాసము బొందెను. సకలశాస్త్రములు వానికి గరతలామలకమయ్యెను.,