కాళిదాస చరిత్ర
బశంపుమనికోరెను., అప్పుడాతడు కాళిదాసుపశించిన రెండు చరణములనే చదివెను. భవభూతిహృదయమది కాదని వారించిన పండితులు సిగ్గుపడిరి. భవభూతి బ్రతికినందుకు కాళిదాసుని ప్రజ్ఞావిశేషము మరింత స్దిరపడినందుకు మహారాజు మిక్కిలి సంతసించి బహుమానమిచ్చెను. అది మొదలుకొని జాత్వవిద్య ముందెన్నడు బరీక్షింపగూడదని రాజి నిశ్చయించుకొని యాకన్యను భవభూతికిచ్చి వివాహము చేసెను.
తే నె టీ గ
ఒకనాడు భోజ
కాళిదాసు లిరు
వురు గూర్చుండి విద్యాగోష్టి వినోదంబులతొ గాలక్షేపము చేయుచుండ నొక తేనెటీగ నచ్చోటికివచ్చి యనేక భూపాలుర కిరీటమాణిక్యములచేత నీరాజితములైన యారాజ పాదములచెంతన్నడతెగక గుంయ్ మని మెఱయుజొచ్చెను. వింజామరవేయు నట్టి హాచాతి చామరి మొలతొ దానినెంతదొలినను నదికదలక యచ్చటనే గానముచేయుచుండెను. అదిచూచి రాజేంద్రుడు కవీంద్రుని పిలిచి "కవిసార్వబౌమ ! ఎన్ని సార్లు తోలినను నీ తేనెటీగ నాచేతులను గాళ్లను విడిచిపట్టక ఇట్లు మొఱయుటకు గారణమేమి?" యనియడిగెను. ఆప్రశ్నకు నుత్తరముగా నమ్మహా కవి రమ్యార్దగర్బితమైన యీక్రిందిశ్లోకము రచియించి చదివెను.
శ్లో॥దేయం భోజ ఘనంధనం సుకృతికాంనోసంచితవ్యం
గదా
కర్ణన్యాపి బలేశ్చవిక్రమంనేరద్యాపి కీర్తి స్దిరా
అస్మాకం మధు దానభోగరహితం నష్టం
చిరాత్సంచితం
తే నేయం తనపాణివారి యుగశం కర్షత్యహో
మక్షికా
తా॥ఓభోజమహారాజా! సత్పురుషులకు విశేషముగా ధనము దానమియ్యవలయును. ధన మెన్నడు దాచిపెట్టగూడదు. అట్లు