పుట:హిందూమత 2016-08-13.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హిందూమతములు

వివేకమహితులగు విహితులారా!

మనము కన్నులార నొక యుత్తమాశ్వమును జూచుచున్నప్పుడది గాడిద యని గాని, కర్ణకఠోరమయిన శబ్దమును వినుచున్నప్పు డది శ్రావ్యనాదమని కాని, యీ రీతిగానే మన మేయింద్రియముచేతనయినను గ్రహించుదానికి విరుద్ధముగా నన్యులెవ్వరైనఁ జెప్పుదురేని మనము వారి మాటల నెంతమాత్రమును విశ్వసింపఁజాలము; ఇట్లు మన కింద్రియముల ద్వారమున నవ్యవహితముగాఁ గలుగు జ్ఞానము ప్రత్యక్షమనఁబడును, కాఁబట్టి ప్రత్యక్షమునకు, విరుద్ధముగా నుండుదానిని దేనినిగాని మనము నమ్మరాదు. లోకములో ప్రత్యక్ష జనిత జ్ఞానమే సర్వోత్తమమయిన దయినను, అన్ని విషయములలోను స్వానుభవముచేతనే నిజమును గనుఁగొనఁ బూనుట యొక్కమనుష్యున కసాధ్యము గనుకను కొన్నివిషయములలో సహేతుకములయిన యూహలచేతనే సత్యమును తెలిసికొనుట సాధ్యమగును గనుకను ప్రత్యక్షమునకు విరుద్ధముగా నుండనంతవఱ కనుమానప్రమాణమును గూడ నంగీకరింపవలసియున్నది. ఒకఁడు తన జీవితకాలమునంతను ధారపోసి విమర్శించినను స్వానుభవముచేతను యుక్తిచేతను సమస్త విషయములయందును యదార్థజ్ఞానమును సంపాదింపఁగలుగుట సంభవింపనేరదు గనుకను, వెనుకటివారు చర్చచేసి తెలిసికొన్నవిషయములనే మరల సాధించుటకయి ప్రయాసపడి కాలమును వ్యర్థముగాఁ బోఁగొట్టుచుండుటవలన నభివృద్ధి కవకాశము కలుగకపోవును గనుకను, ప్రత్యక్షాదులకు విపరీతముగా నుండునివఱకావిషయములలో విశేషశ్రమ చేసియున్నవారి నడిగి తెలిసికొనిగాని వారు వ్రాసి