పుట:హాస్యవల్లరి.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కా - ఇప్పుడు మన సంభాషణయావత్తూ అనుదాత్తం! భోజనం అరణ్యమెంటు చేయించండి ఉదాత్తంపూచీ నాదీ!

36

ప్రకాశం -- ఏమండీ మేష్టారూ!

మే - ఏమిటి?

ప్ర - ఈగంట మాకు డ్రాయింగులేదండి!

మే - శుభం. ఇప్పుడు ఏమిటి నువ్వనేది?

ప్ర - ఎవరో ఉందని అన్నారు నాతో!

మే - నీ 'తో' అన్నది ఇంగ్లీషు నేనా?

ప్ర - అవునండి,

మే - అంటే తక్షణం ఆ డాయింగేకానీ!

37

నాగమ్మగారు ఇంటికొచ్చిన తన చెల్లెలి మరిదితో ముచ్చటించుతూ.

నా - మీరేమన్నా చదువుకున్నారా?

మ - దులాబీగా తిరగడంచేత చదువు వెన్నేసిపోయిందండి మనికి.

నా - ఏమన్నా, ఉద్యోగమాండీ?

మ - అబ్బే! మనకి ఓటే ఉద్యోగమండి!

నా - ఏమన్నా పిల్లలాండి?

మ - మనికి ఆబాధోటి లేదండి నేటివరకు!

38

ఒకాయన ఉద్యోగం దొరక్క గర్వంచచ్చి శాంతం హెచ్చి మేస్టరీ ట్రైనింగులో చేరిన కొత్తరికంలోనే ఒకనాడు డ్రాయింగు గంటలో డ్రాయింగు మేష్టరు ఒక నక్కబొమ్మ గోడబల్లమీద గీయగా.

ఆయన - (ఏర్పడని పరిచయంతో) అదేం కర్మమండోయి మేష్టారు! ఎక్కడో పెద్ద “డిజ్ అప్పాయింటుమెంటు” అయి వచ్చినట్లు తోకముడుచుగున్నట్లు అల్లా వేశారేం నక్కనీ?

మేష్టరు - "అప్పాయింటుమెంటు” అయినతరవాతగదా తోక లేవడం, ఇప్పణ్ణించీ ఎందుకని!

39

రామగోపాలం - ఒరేయి, వరదరాజులూ! నువ్విచ్చేవన్నీ దొంగసాక్షీకాలని రత్తయ్య నిన్ను యాగీ పెడుతున్నాప్ష!

వ - నిజం! నిజమే! వెళ్ళి పళ్ళూడగొడతా ఒక్కలెంపకాయితోటి.

రా - (చప్పరించి) ఒక్క లెంపకాయకి ఎన్ని ఊడతాయి మహా!

వ - ఏం? రెండువరసలూనూ!

రా - అల్లాయితే, రెండుమూడు కొడితేగాని తెమల్దేమో!

40

ట్రైనింగు అయిన ఒక మేష్టరు ఒకస్కూలుతాలూకు కమిటీ మె (నె) 0బరు దగ్గిరికెళ్ళి నమస్కరించగా,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

76

హాస్యవల్లరి