పుట:హరివంశము.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

414

హరివంశము

     [1]గేలఁ దాల్చినమేటి దమ్మేలఁ గ్రాలు, సౌఖ్యనిరతులు వ్రతులు నిష్కలుషమతులు.133
చ. అమరులకంటెఁ బూర్వు లమరావలిపేర్మి సహింప రుగ్రులై
     యమరకులంబు నొంచుటకునై తపముల్ సవరించి సర్వలో
     కములను నాక్రమింతురు మగంటిమిఁ గోపమునం జలంబునన్
     సమధికు లింతి వీరు పటుసాహసనిత్యులు దైత్యు లారయన్.134
క. దైతేయులట్ల యతివి, ఖ్యాతులు సర్వగుణనివహగౌరవమున ను
     ద్యోతితమూర్తులు సూచితె, నాతీ దానవనిశాటనాథుల వరుసన్.135
శా. పక్షంబు ల్లలిఁ దాల్చు కీరనిభదివ్యద్వాణులుం గాణులున్
     జక్షూరాగముఁ గంఠరాగము సురాసంసక్తి గేయోక్తి నా
     లక్షింపం బొలుపారుమోహకతనూలక్ష్మీవరేణ్యు ల్లస
     ద్దాక్షిణ్యుల్ మఱి వీరిఁ జూడు వరగంధర్వుల్ కురంగేక్షణా.136
మ. అణిమాద్యష్టవిభూతులుం దమకు నిత్యాయత్తలై చేరఁగాఁ
     బ్రణయంబుల్ దళుకొత్తఁ దారుఁ బ్రియలుం బ్రాణంబు లైక్యంబుగా
     గుణితక్రీడలఁ గూడి రూఢ మగు కోర్కు ల్సంతతామోదసౌపా
     రణలం దృప్తిసనంగ నొప్పుదురు వీర ల్సిద్ధు లిద్ధాకృతుల్.137
మత్తకోకిల. ఆధనేశుపురంబువారలు యక్షువర్యులు వీరు వి
     ద్యాధరేంద్రులులు వీరు నిత్యశుభాభిరాములు భూరిమా
     యాధికారులు వీరు గుహ్యకు లంగనారమణక్రియా
     వీథి సర్వపధీను లుగ్మలి వీరు కిన్నరపుంగవుల్.138
మ. సకలాజాండవిలంఘనక్షమబలస్ఫారుల్ మహావిక్రముల్
     శకునిశ్రేష్ఠులు వీరు వీరు త్రిజగత్సంభావ్యభోగుల్ యశః
     ప్రకటోద్యోగులు భోగు లక్షయసుఖప్రాప్తోర్ధ్వలోకాస్పదుల్
     సుకృతుల్ వీరు సురాంగనానిచయహృత్సుస్నిగ్ధభావోజ్జ్వలుల్.139
ఉ. మర్త్యులు వీరు పెంపున నమర్త్యులకంటె నుదగ్రులై మనో
     వర్త్యవిరోధసంప్రసరవర్గచతుష్టయలబ్ధవిస్ఫుర
     త్కీర్త్యనుభావముల్ భువనఖేలనలోలములై యెలర్ప నా
     పూర్యసమానసంపదలఁ బొంపిరివోయెడువారు నెచ్చెలీ.140
చ. మనుజులయందు నస్ఖలితమానసమగ్రులు రాజవంశసం
     జనితులు వీరు హైహయులు శైబ్యులు [2]వైన్యులు రాఘవాన్వయుల్
     జనకులు నైషధుల్ భరతసంభవు లాదిగఁ గాశికోసలా
     ద్యనుపమదేశరాజ్యవిభవాధికసౌఖ్యకళావిజృంభితుల్.141
వ. ఇట్లుగా నస్మద్విలిఖితం బైన యీచిత్రపటంబునందుఁ దగులనిరూపంబు లేదు వీరి

  1. నెలమిఁ దాల్చినయమ్మేటి యేల లీలఁ, గ్రాలు సౌఖ్యనిరతులు నిష్కలుషమతులు.
  2. వారలు