పుట:హరివంశము.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

386

హరివ౦శము

     త్కీలా[1]లోరుస్రవంతు [2]ల్కిలకిలరవసంక్రీడమానోగ్రభూతా
     భీలశ్ర్రీలం దలిర్చెం బృథుపలలచయస్ఫీతరోదస్యు లొప్పన్‌.136
వ. అట్టియెడ నేకలవ్యుం డేపుమిగిలి యాదవసైన్యంబున కెదిర్చి తనపేరు సెప్పి
     యార్చి శంఖం బొత్తి యిది యేమి సాత్యకి యక్కడవోయె గృతవర్మ పొడసూ
     పండు బలదేవునికి మదిరామదంబు దెలిసెనే కృష్ణుం డెచ్చోట నొదిఁగె నేను
     వచ్చుట నెఱింగిన నెంతటివారికిం దాల్మి దలకొలుప శక్యం బగునే యనుచుఁ
     గదిసినం గడంగి యదువీరు లతనిం దాఁకి రమ్మహాధన్వి యుగ్రసేను నేఁబది
     బాణంబులను వసుదేవు నేడింట నుద్ధవునిం బదియేనింటను నక్రూరు నేనింటను
     గదుని నిరువదేనింటను సారణుం బదునొకంటను హార్దిక్యు నాలుగింటను నొంచి
     తదనుచరులగుయోధుల నరిమితశరపరంపరలం గప్పినం దలరి సైన్యంబులు విచ్చె
     నెల్లదెసలం దల్లడంబున దీపహస్తులు దివియలు వైచి పాఱినఁ జీఁకటి భయాంధ
     కారంబునకుం దోడ్పడియె నట్లు యదువర్గం బొదుంగుటయుఁ బౌండ్రుండు
     తన్నుఁ బ్రాప్తవిజయుంగాఁ దలంచి చెలంగి యెలుంగె త్తి.137
సీ. ఓరాజవరులార మాకును మీవారుం దడయ కొక్కట నెల్లకడలఁ గదిసి
     కోటబ్ర్రాఁకుడు కం లీలఁగూలంగఁద్రోయుడు [3]తాలోగ్రయంత్రకేతనచయములు
     పురిలోనఁ జొచ్చి విస్ఫురితగేహంబులయర్థసంచయముల నాఁచికొనుఁడు
     వెలయాండ్రురను గొండియలఁ బరిచారికాశ్రేణుల నొండొండ చెఱలువట్టుఁ
తే. డేనుఁగులను గుఱ్ఱములను హేమరత్న, రథవితతిఁ గొనుఁ డనిఁ దొడరంగఁబడిన
     పురుషు నాయుధహస్తునిఁ బొడిచి కూల్పుఁ, డింతతోడ [4]నవృష్ణియై యిలయెలర్ప.138
వ. అనిన నతనియాజ్ఞ నఖిలసేనాచరులుం గోట వొదివి బరవసంబుచేసి రాసమయం
     బునఁ దదీయంబగు కలకలంబులు బహుళంబులైన నాకర్ణించి యనుత్సాహు లై
     యున్న యాత్మీయుల నందఱం జూచి సాత్యకి దనమనంబున.139
చ. సకలకుటుంబభారమును సన్మతి నాపయిఁ బెట్టి యాత్మలో
     వికృతి యొకింత లేక కడువేడ్క నుమాపతిఁ గొల్వ దవ్వుగా
     నకట ముకుందుఁ డేగెఁ రిపు లాక్రమ మి ట్లొనరింప నాకు నూ
     రక కనుఁగొంట పాడియె పురంబును రాజ్యముఁ గాతు నెమ్మెయిన్‌.140
క. ఏను గడంగిన నెదురం, గా నెవ్వానికి వశంబె కమలాక్షపద
     ధ్యానపరుల కెందు[5]ను జయ, మౌ నని చెప్పుదురు పెద్ద లది బొం కగునే.141
వ. శాత్రవుని దుర్జయత్వంబుకతనను బహుదేశసైన్యంబులు గూడి పెల్లుగాఁ [6]దోఁచు
     టవలనను గేశవుండు లేకునికి బలుమగలును ఱిచ్చవడి చూచెదరు వీరిం దెలిపి
     పురికొలుపకున్నఁ గర్జంబు దప్పు నని తలంచి దారుకానుజు నరదంబు నడుపం
     బనిచి సింవానాదంబు సేసి శరాసనశింజినీబరిస్ఫాలనం బొనర్చి దొరలం
     బేర్కొని.142

  1. లోగ్రస్రవంబు
  2. వెలితురి
  3. తాలాట్ట
  4. అవృష్టియై
  5. నభయ
  6. దోచు