పుట:హరివంశము.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

348

హరివంశము

     త్సేకం బగ్నియు హవియు, ననాకులమంత్రశుభతతులు వడఁతు మునీం ద్రా.40
వ. ఇట్లగుటం జేసి యాశ్చర్యధన్యశబ్దంబులు రెంటికి వాచ్యుం డమ్మహాపురుషుం డని
     చెప్పిన నధ్వరంబుల పలుకులు విని యిచ్చటికిం జనుదెంచి యే నిప్పరమేశ్వరుం
     గని మున్ను కూర్మప్రభృతులతోడం బరంపరామార్గంబునం బలికిన యట్ల పలికిన
     నిద్దేవుండు తాన యజ్ఞమయుండ నగుదు నయ్యజ్ఞంబును సంపూర్ణదక్షిణతోడం
     గూడినం గాని యస్మదాత్మకంబు గానేర దని యానతిచ్చె నవ్వాక్యసమాప్తి
     యితనియందఁ గన్నవాఁడ నై సంతోషించి యిక్కడఁ దడయ నొండుపని
     లేదుగా పోయి వచ్చెద నంటి నని సవిస్తరోపన్యాసం బొనర్చి నారదుండు.41
క. ఆ రాజన్యులు దన్నును, గౌరవమునఁ బూజసేయఁగా వీడ్కొని య
     న్నారాయణుచేతను స, త్కారము గని చనియె గగనగతి నాత్మేచ్ఛన్.42
వ. తదనంతరంబ.43
మ. నరనాథోత్తము లెల్ల విస్మయనిమగ్నస్వాంతు లై సంయమీ
     శ్వరుఁ డి ట్లొప్పుగఁ బల్కి తెల్పునె జగద్వంద్యుండు గోవిందుసు
     స్థిరమాహాత్మ్యవిశేష మిట్టి దగునే జిష్ణుండు గృష్ణుండు శ్రీ
     కరుఁ డీదృగ్విభవుండుగా నెఱిఁగినం గల్యాణముల్ బ్రాఁతియే.44
తే. మనము నిర్దోషమతులమై మంటి మనుచు, నమ్మహాతేజునకు వినయమున మ్రొక్కి
     [1]భక్తి గీర్తించి రంతఁ దత్ప్రభుత కాత్మ, నలరి కొంద ఱెంతేనియు నద టడంగి.45
క. ఇదియు నదియు నేటిది యని, మదిఁ గొందఱు మత్సరంబు మానక మానో
     న్మదమానసులై యుండిరి, సదోషయగుబుద్ధివినయసంగతి యీమిన్.46
వ. వారలు సముచితసల్లాపానంతరంబ ప్రియపూర్వకంబుగా నద్దేవు వీడ్కొని నిజ
     దేశంబులకుం జనిరి జలజోదరుండు సమస్తబంధుజనసమేతంబుగాఁ బురప్రవేశం
     బొనర్చి సుఖం బుండె నని చెప్పిన జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.47
శా. మాపెద్దల్ హరిసంశ్రయంబునన మున్ మన్నారు దత్కీర్తనా
     లాపప్రీతిఁ గృతార్థజన్ములము తెల్లం బేము న ట్లౌట మా
     కేపారన్ భువనద్వయంబున ధ్రువం బిష్టార్థసంప్రాప్తి యై
     [2]పాపం బేజనుఁ జెంద దొండొకఁడు దాఁ బ్రత్యూహ మీపేర్మికిన్.48
చ. మునివర యుష్మదీడితసముజ్జ్వలవిష్ణుకథాసుధారసం
     బనయముఁ గ్రోలి క్రోలి యిటు లాత్మ యొకింతయుఁ దృప్తి బొంద దిం
     కను వివరింపవే లసదగణ్యగుణౌఘవిచింత్యుఁ డమ్మహా
     త్మునిచరితంబు లుద్ధత విమోహతమోహరణప్రవీణముల్.49

అర్జునుఁడు ధర్మరాజునకు శ్రీకృష్ణుని ప్రభావంబు చెప్పుట

వ. అనిన వైశంపాయనుం డమనుజనాయకున కి ట్లను భీష్ముఁడు శరతల్పగతుం డై
     ధర్మనందనునకు ననేకపుణ్యకథాకథనం బొనర్చు సమయంబునం బ్రసంగాధీనం బై

  1. భక్తి గీర్తించి రందఱఁ బ్రభుతనాత్మ నలరి, కొండ్రింతయును స్రుక్కి రద టడంగి.
  2. పాపంబున్ మముఁ జెంద దొంద దొకఁడున్.