పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

383




నారద శివుల సంభాషణలు

సర్వలోకశరణ్య! శైలజారమణ!775
శర్వ! గంగాధర! సద్భక్తవరద!
వినుపింతునొక వార్త విను చిత్తగించి
తనర విజృంభించి ధర్మనందనుఁడు
అనుజులు దుర్యోధనాదులు గొలువ ఁ
జనుదెంచి ధనదుని సరకుగాఁ గొనక780

చెలరేఁగి యుద్ధంబు సేయుచున్నాఁడు
తలపోయ ధర్మనందనుసేనలోన
గురుఁడు భీష్ముండు నాగురుతనూభవుఁడు
కురురాజు భీముఁడు గోత్రారిసుతుఁడు
పరగు నానాదివ్యబాణకౌశలులు785

నెరయోధవర్యుల నీ వెరుంగుదువు
కదనరంగమున నాఘనులతో శ్రీదుఁ
డెదిరించి పోరాడుటే దుస్తరంబు
పాటించి యిఁక నొక్క భయమును గలదు,
తేటగా నావార్త తెలిపెద వినుఁడు790