పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

సౌగంధిక ప్రసవాపహరణము

ధరఁగూల్చి నడువ గంధర్వులు నాల్గు 1880
కోటులు గ్రమ్మిన గోరించి మోది
ఘోటకంబులఁ గూల్చి కుంజరఘటలు
గరకరి వధియించి గద ద్రిప్పుకొనుచు
వరబలోద్దండుడై వచ్చుచుండఁగను
దనుజాల యక్షగంధర్వులఁ గూల్చి 1885
వనజముల్ గైకొన్న వాఁడీతఁ డనుచు
దెప్పరంబైన భీతిని దల్లడిల్లి
చప్పుడుల్ చాలించి చలములు డించి
చతురంగబలము లచ్చట నిల్వ వెరచి
పతి నొప్పగించి నిబ్బరమున నరిగె 1890
అంతట నాకుబేరాత్మజుం డలిగి
పంతంబుతో సార్వభౌముపై నెక్కి
పవనతనూభవుపై గవియింప
గవిసిన నామత్తకరిమీఁద దూరి
పటుగదాహతిని కుంభస్థలం బవియ 1895
వ్రేటు వేయఁగ చండ వేదండంబు బెగడి?[1]

  1. నటువ్రేయ చండవేదండంబు బెగడి.