పుట:సులక్షణసారము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సులక్షణసారము

తాత్పర్యో దాహరణసహితము.

ఉపోద్ఘాతము



రామా స్తనమండలీమిళితకాశ్మీరార్ద్రవక్షంబుతోఁ
బారావారతరంగసంగతలసత్పర్యంకనాగంబుపై
గారుణ్యామృతపూరపూరితకటాక్షశ్రీలఁ బెంపొందు గం
భీరస్వాంతుఁ డనంతుఁ డాశ్రితజనాభీష్టప్రదుం డయ్యెడున్.

1


అవతారిక.

కవిశిరోమణియగు తాతంభట్టు సులక్షణసారమను ఛందోగ్రంథమును రచియింపఁ బూని, తా రచింపనెంచినగ్రంథము నిర్విఘ్నముగ నెఱవేఱుటకై, తొల్లింటికవుల యాచారము ననుసరించి, గ్రంథాదియం దాశీర్వాదరూపమగు మంగళమును జేయుచున్నాఁడు.