పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

364

సింహాసన ద్వాత్రింశిక


మోకాళ్ళఁ దల లిడి ముడిఁగి నిద్రింతు రే
        కాలంబునను మేనఁ గప్పు లేక
యతిదరిద్రునకు నిల్లా లౌటకంటెను
        జచ్చుట గడుమేలు సతుల కెల్లఁ
బాపకర్మునిఁ జెట్టవట్టుట మొదలుగా
        నిడుమలేకాని యొం డెఱుఁగననుచు


ఆ.

మగువ తెగిపల్క నవ్వగ మాన్పలేక
జీర్ణదేహుండ ధనము లార్జింపలేక
యూఁతకోలయుఁ దోడుగా నొయ్య వెడలి
దూర మరుదెంచి [1]యడవిలోఁ జేరినాఁడ.

208


చ.

అనవుడుఁ జింత నొంద కది యట్టిద యెమ్ములు బూదిపూఁత దు
న్నని పసరంబుఁ దోలు మసనంబుల యున్కియుఁ జూచి నిర్ధనుం
డని శివుఁ బాసి రత్ననిధి యైన సముద్రునిఁ గూడె గంగ భా
మినులు ధనంబు లేనిపతి మెచ్చరు లేమియె కీడు గావునన్.

209


క.

ధన మొకటి యేల తలఁచిన
పను లన్నియు వీనిచేత ఫలియించుం గై
కొను మని మహిమలు చెప్పుచు
నెనిమిదిరత్నములు నతని కిచ్చెం గరుణన్.

210


శా.

ఆవిప్రుండు మణిప్రభావమున దివ్యంబైనదేహంబు స
ద్భావంబున్ ధనలబ్ధియుం బడసి యుత్సాహంబుతోఁ గంచికిం
బోవం గోరి నభోగతిం జనియె, నాభూపాలుడున్ దానవి
ద్యావైచిత్రి ఘటించి వచ్చె నతిమోదం బైన యుజ్జేనికిన్.

211
  1. చావంగఁ గోరినాఁడ