పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

354

సింహాసన ద్వాత్రింశిక


సురవరు నాశ్రయించి తగు సుస్థితి నక్కడనుండి యాస్థతో
సురగురునీతిశాస్త్రమును శుక్రు నయక్రమముం బఠించుచున్.

155


ఉ.

ఆకడ నీతిశాస్త్రవిదుఁడై గురు వీడ్కొని యేగె వేడ్కతోఁ
గాకితమూలశక్తి గనిగా నొనరించిన పైఁటిచట్టునా[1]
నేకశిలాభిధానమున నెన్నిక కెక్కి ధరిత్రిలోన నే
పోకలఁ బోనియట్టి సిరిపుట్టినయింటికి నోరుగంటికిన్.

156


క.

పసిఁడియు రత్నము మున్నుగ
నిసుముక్రియం బెక్కుధనము లీనఁగ నిలకు
న్వసుమతియు రత్నగర్భయు
వసుధయు ననుపేళ్ళు నిక్కువము లౌనచటన్.

157


ఉ.

చందనగంధులు న్విటులు జాణలు దానవినోదులుం బ్రభా
సుందరమూర్తులుం గవులు శూరులుఁ బెద్దలు నుల్లసిల్ల సం
క్రందనవైభవాఢ్యుఁ డగు కాకతిభూపతి రాజ్యలక్ష్మిఁ బెం
పొందెడు నప్పురంబున మహోత్సవలీలల నుండె నేర్పునన్.

158


వ.

అట్లు కొన్నిదినంబు లుండి తత్పురజనపరిచయంబున సకలకళాప్రవీణుండై మగుడం గడంగి మహాతీర్థవిలోకనార్థియై యట చని దూరంబున.

159


క.

ఆతఁడు త్యంబకశిఖరో
ద్భూతను విఖ్యాతఁ బరమపూతఁ ద్రిలోకీ
మాత మహాపాతకసం
ఘాత విఘాతానుయాతఁ గనియెన్ గంగన్.

160


క.

ఆనదికి మ్రొక్కి ముఖ్య
స్నానం బొనరింప డిగ్గి చని యుదకం బా

  1. పైఁడిపట్టునన్