పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

237


గ్విలసనరవములుఁ బలుకులు
మొలతేరఁగ సంభ్రమించు మ్రొక్కును లేచున్.

173


క.

మోహమున మన్మథానల
దాహము పె ల్లెఱుఁగలేక తనప్రాణంబుల్
దేహమునఁగలుగుటకు సం
దేహముగాఁ జెయ్వులుడిగి దృష్టి మొగుడ్చున్.

174


క.

సతి విడిచిన ప్రాణంబులు
పతి నిలుపఁగ నుండె నేఁగఁ బాడియె యతఁ డీ
యతివ డిగవిడిచి తలఁగిన
నతివేగమ తలఁగి పోద మని యున్న వనా.

175


క.

ఖేచరవంశవిభూషణ
యేచోట వసింపలేక యెత్తుఁబయన మై
నాచెలిప్రాణంబులు నినుఁ
జూచినతావునన యెదురుచూచుచు నుండున్.[1]

176


మ.

అని చెప్పంగ లతాగృహంబుకడఁ బ్రాణాధీశుచే నేఁడు మ
న్నన లే దిం కిట నెన్నిజన్మములకైనన్ భర్త జీమూతవా
హనుఁ డౌఁగాత మటంచు దీఁగెయురిలో నాబాలకంఠంబుఁ దూ
ర్చిన లోకాంబిక యైన యంబిక కృపం జేపట్టి తా నిట్లనున్.

177


క.

హృద్యాకారిణి యీమర
ణోద్యోగం బుడుగు బాలుఁ డుత్తముఁడు యశో
విద్యోతీతుఁ డధికాయువు
విద్యాధరచక్రవర్తి విభుఁడౌ నీకున్.

178
  1. మది, గోచరమగు ఠావులేక గొంకుచునుండున్