పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

31



పుణ్యతపోవనంబున రత్నకాంచన
మయమైన దేవతాలయము గలదు
లోకైకవంద్య మందాకినీజలధార
తోరమై ముందటఁ దొరఁగుచుండు
నానీరు శుద్ధున కమృతమై పొలుపారుఁ
బాపికిఁ గాటుక భంగిఁ దోఁచు[1]
ఆ. దానిపొంత నొకఁడు మౌనియై జపముతోఁ
బాయకుండ వేల్మి సేయుచుండు
నతని కెన్ని యేఁడు లరిగెనో యొలికిన
హోమధూళి హిమనగోన్నతంబు. 69

మ. అని చోద్యంబుగఁ జెప్పిన న్విని తదీయాలోకనోత్సాహియై
మనుజేంద్రుండును దిగ్గనం గదలి రమ్మా చూత మామౌని పా[2]
వనతీర్థం బని వానిఁ దోడుకోని భాస్వత్ఖడ్గసాహాయ్యుఁ డై
చనియెం గ్రూరమృగప్రచారతరువిస్తారంబులం దూఱుచున్. 70

వ. ఇట్టి దుర్గమమార్గంబునం జనుదెంచుచు నొక్క యెడ. 71

ఉ. భూరమణుండు గాంచె నతిభూరిపయోధరఝాట మాత్మవి
సారపునఃప్రరూఢపటుశాఖమహావటజూట మంచితో
ర్వీరుహసంభృతైకమునివీరకృతోటజవాటము న్సునా
సీరమణిప్రభాపటలచిత్రితకూటముఁ[3] జిత్రకూటమున్. 72

సీ. అందులతీఁగె లింద్రాంగణాగములతోఁ
జెలిమి సేయుచు మిన్ను గలయఁబ్రాఁకు

  1. ఆనీరు పుణ్యుల కమృతంబువలెనుండు - చిన్నయసూరి
  2. చూత మాదివ్యపావన
  3. చిత్రవనాటము