Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100 సాక్షి



'ప్రోటోప్లాజముయొక్క కదలికనే ప్రాణముగా భావింపవచ్చునని మరికొందఱు విద్వాంసులు చెప్పియున్నారు. ప్రోటోఫ్లాజ మనంగా నతిసూక్ష్మమైన ప్రాణి-అంతకంటే నూ క్ష్మ తరప్రాణి యుండ. దని కొందణ-యభి ప్రాయము. కాని యామాట సత్యము కాదని మరికొందణ యభిప్రాయము. ్రోటోఫ్లాజమున కెంతయో పూర్వచరిత్ర మున్నదనియు, దానికిం బితామహ ప్రపితామహాద్యనేకపూర్వు లుండి రనియు, వారు దానికంటు సూక్ష్మతర జీవు.లనియు, దాని వంశవృక్షమును మరింత. ప్రజ్ఞాకాశలమునం బరీక్షించినవారు పలుకుచు న్నారు. ఈశిరోజసహ(్రధా విభేదనముతో మన "కంత యావశ్యకత లేదు. ప్రోటోప్లాజమే 'ప్రాణిప్రాతిపదికముగా మనము పరిగణింపవచ్చును. దీనిలో ప్రోటీడ్డను పదార్దమున్నది. 'ప్రోటీ డ్లను పదార్హమున కార్చను హైడ్రొజను నైట్రోజను అక్సిజను సల్ఫరు అను పదార్హము లున్నవి. ఆ పదార్ధములు చిత్రవిచిత్రాతి విచిత్ర మహావిచిత్ర మేళశనమునం గలసియున్నవి. ఈ వస్తువు లన్నియు సామాన్యవస్తువులేకాని వాని మేళనవైచిత్ర్యమే దుర్ల్హ్హేయముగ నున్నది. ఈ విలక్షణమైన విచిత్రమైన విశోధనాసాధ్యమైన మేళన పద్దతివలననే ప్రాణ మనునచి పుట్టుచున్న దని యనం దగును. కాని ప్రాణము-పైని చెప్పినవస్తువుల సాముదాయకగుణ మనిమాత్ర మెన్నందగదు. నీటిలోని గుణము ఆక్సిజను హైడ్రాజను వాయువులలోని సాముదాయక గుణమని చెప్పవచ్చునా? ప్రాణ మట్టి సాముదాయకగుణము కాకపోయినను నమ్మేళన వైదిత్రీ సంజాతగుణ, మని చెప్పక తప్పుదు. ఈ ప్రాతిపదిక ప్రాణులెన్నో - కలిసియుండును. ఏ ప్రాతిపదిక కా ప్రాతిపదికమే ప్రాణము గలది. అన్యోన్యసహాయశూన్య .ముగ నవి జీవింపం గలవు. లోనుండి కాని పైనుండి కాని కలిగిన ప్రమాదమువలన నవి నశింపవచ్చును. [ప్రాణ మన నేమో తెలియుటకు ప్రోచోప్లాజములోని ప్రోటీ డ్లేమో పూర్తిగాం దెలియవలయును. ప్రోటీఢ్డులోనున్న వస్తువులే తాలియునుగాని 'యావస్తుసమ్మేళన విభాగవి ధానాదులు బొత్తిగాం దెలియవు. అవి తెలియనంతవఅకు ప్రాణ మన -నేమో చెప్పుటకు వీలులేదు. నాయనలారా! ఇవియన్నియు నాయభిప్రాయము లనుకొనుచున్నారేమో పాశ్చాత్య పండితుల ధ్రాంతలలోని యభిప్రాయములను నా కవగాహమైనంతవణకుం దెలియం బఆఅచుచున్నాను. క్రీస్తు పుట్టుటకు రెండువేల సంవత్సరముల ముందునుండి పుట్టిన తరువాత దాదావుగా రెండువేల సంవత్సరముల వణకు మహాధీశాలులందరు మహాశా(స్త్రజ్జు అందరు [ప్రాణ మేదియో కనుంగొనుటకుం బడవలసినపాటులన్నియుం బడినా రని చెప్పవ చ్చును. ఇప్పటికిం బ్రాణ మేదో తెలియలే దని సిద్దాంత పజచుకొనిరి. కాని పాప మా శా(స్త్రుజ్జుల కాశమాత్ర మింకను వదలలేదు. ప్రోటీఢ్డును గూర్చి పూర్తిగా వారికిం దెలిసిన ... ప్పుడు ప్రాణమేదో తెలియంగల దని వారింక నాశపడుచున్నారు. ఇది కేవల మేషాండభ్ర

' మము. ్రోటీడ్డునుగూర్చి పూర్తిగాం దెలిసినప్పుడు ప్రాణమునుగూర్చి తెలియు ననంగ్గా బ్రాణమును గూర్చి పూర్తిగాం దెలిసినప్పుడు ప్రాణ మనంగ నేమో తెలియునన్న మాట -అంఛకంటె లేశమును భిన్నము కాదు. తత్త్వమెరింగినవానికి బ్రహ్మజ్ఞానము కలుగు ననంగా బ్రహ్మజ్ఞాన మున్నవానికి బ్రహస్తిజ్ఞానము కలుగు నన్నమాట కాదా-ప్రాణముం బాసినవాం కో దిరుగ' - బ్రదికివచ్చినయెడల మన కతనిమూలమున మరణానంతరావస్ట్ర తెలియుననంగా నదియులేదు-ఇదియు లేదన్న మాటయేనా? గణపతికి గంపెండుండ్రా లుళక్కియైనప్పుడు నీ కాంతకడుపుగూడ నేల యుళక్కి కాదు? కావున నిందునుగూర్చి యజ్ఞానమే సిద్దాంతము. శిలాశాసనము.