సారంగధర నాటక ప్రదర్శనము
25
సీ. ❝ నీకుఁ గోపం బేల? నాకుఁ జెప్పుము నాతి! ❞ యనఁగ నదివఱకు మాటలకు లొంగనికాంత పాటకు స్వాధీనయై పైయర్ధపాదమును.
❝నాతోడఁ బలుక కోభూతలేశ!
యనియెను.
రా-నిన్నుఁ బ్రాణసమముగా నేఁ జూచుకొంటిని.
చి-నేను నీయిల్లాలను గాను బొమ్ము.
రా-రత్నాంగి విడిచి నీప్రాపుఁ జేరినవాఁడ.
చి-నేను జచ్చితి నంచు నెంచు మింక.
రా-బిగువైనకౌంగిటఁ బెనంచి ముద్దీయవే?
చి-కోడల నంటకో కుతలనాథ?
రా-కోడ లంటివి? యది యేమి? కోమలాంగి!
చి-కొడుకు నుంపుడుకత్తెఁ గోడ లనఁదగదె?
రా-ఏమి? వానిని దెగవ్రేతు నీక్షణంబ
చి-నన్నుఁ జంపుము మామయ్య! మన్ను ఱేఁడ!
ఇట్లు వీరిద్ద ఱొకరి దొకరుఁ బుచ్చుకొనిన తరువాత మిగిలినదానిని వేరొక రానందభైరవితో సాగఁదీయుచు నొకచెంపను వీరుగొట్ట నొకచెంపను వారు గొట్టుచు వేపారుల యుఠాణిలోవలె నొకతములపాకుచుట్ట నొకరు కొరికి ❝థూ❞ యన, దాని యర్ధమును వేరొకరు కొరికి తిరుగఁబడి ❝థూ❞ యనుచుఁ బగులఁ గొట్టుటలతో నరుకుటలతోఁ ద్రెంపులతో ముడిఁబెట్టుటలతో సర్ధపాదార్ధపాదాన్యోన్యసాహాయ్యా వృతుల తో దిక్కుమాలిన శవము నిద్దరు చెరివైపు సాయపడి బుజములు గలిపి శ్మవానవాటికకడకుఁ జేర్చినట్లు సీసపద్యమును నానాస్వర సాంకర్యముతో సంపూర్తిఁజేసిరి. అంతటఁ దెర దిగెను.
మూఁడవయంకమున రెండవరంగమున న్యాయాధిపతియు, న్యాయవాదులు, నేరగాఁడగుసారంగధరుఁడు, సాక్షులు, సేవకులు ప్రవేశించిరి. సర్కారువైపున నున్నన్యాయ వాది నాదనామక్రియతో నేరగానినేరము నంతయు నుపన్యసించెను. నేరగాఁడు భైరవివర్ణమునఁ దననిర్దోషత్వమును హర్మోనియము సాహాయ్యమునను, జప్పతాళపు సాహా య్యమునను స్థిరపరచెను. సాక్షులందరు కలిసిపాడిరి. సారంగధరునివంకనున్న న్యాయవాది సరససంగీతరచనాచమత్కారముగల యొక్క స్వరగతిని జల్లుజల్లునఁ బాడి సంగతులపై ' సంగతులు లేత ముదురు పట్టు జారు సాపు వరివిక చౌకము దురుసు మంద్రము తారకము బొంగు కీఁచు మొదలగు వివిధ భేదసంప్రదాయములతో విసరి వెదఁజల్లి వర్షించి వినువారితల లను బలాత్కారమునఁ బులిమి సారంగధరుని సత్యసంధతను నౌరోజున నటతాళమున నుపన్యసించెను. వెనుకటి కాలము కాదు. వెనుకటియుగము కాదు. వెనుకటిమనుజులు కారు. వెనుకటి సృష్టి కాదు. అంతయుఁ గ్రోత్త! సరిక్రొత్త! సాక్షిచట్ట మంతయుసంగీత. సర్వార్థసారసంగ్రహమే! శిక్షాచట్ట మంతయు గాయనగాయనీ జనపారిజాతమే. న్యాయవాదులందఱు గాయకులే! సాక్షు లందఱు సరిగమాధ్యయనశీలురే! బిళ్లబంట్రోతులందఱు పిళ్లారిగీతములయినఁ బాడఁగలవారే! సారంగధరుని నేరము స్థిరపడిన దనియుఁ, గరపాద