ఉపోద్ఘాతము
7
యాస్తిక్య బుద్ధి గల్గి యిష్టదైవ మని యొండొక దేవుని నమ్మినవారల కాయిష్టదైవము స్వప్నావస్థలో సాక్షాత్కరించి తనభక్తుని నేదే నొకరూపమున ననుగ్రహించుననుట కల్ల యని మనము మనయాత్మ సాక్షికముగాఁ జూచుకొని బూటకముగాఁ దలఁచుటకంటే “నేపుట్టలో నేపా మున్నదో” యని తలంచి తద్విశ్వాసిజనుల కుండు విశ్వాసమును భంగపఱపకుండుటయే భావ్యమని యింతదూరము మనవి చేయవలసి వచ్చినది. ఈ విధముగనే మనకవియును బ్రయత్నపూర్వకముగ స్వప్నము దెప్పించుకొని భగవత్సాక్షాత్కృతిం బడసినట్లు పీఠికలో 20నుండి తెలియఁబడుచున్నది. నిజమును దాఁచినఁ జెప్పఁజాలము గాని యిందులోని సత్యాసత్యములను నిర్ణయింపవలెనన్న నింతకును దన్మయత్వ ముండవలయును. మఱియొక్క మనవి. ఇందఱకును నిట్టి కలలే వచ్చు ననుట యసంగత మందు రని ముందే మనవి చేసి యున్నాను. ఒకటి యాలోచింపవలసి యున్నది వారివారి కాలమున నున్న జనసంఖ్యలు నీనాఁడు మనకు లెక్కకు వచ్చువా రుద్దిష్టకవులును, వారిచేఁ దెలుపంబడినవారును…ఇంతియే గాని తదితరులు లెక్కకు రారుగదా! అంతమందిలో నొకరిద్దఱుగా వచ్చుచు నీనాఁటికి మొత్తమునకు వచ్చిన కొలఁదిమందియును లోకోత్తరపురుషు లగుటవలన వా రందఱికిని నొక్కటే స్థితిఁ బట్టుట యసంగతము గాని, కల్పితము గాని కా దని నమ్మవచ్చును. రామాయణములోఁ త్రిజటకు స్వప్నము వచ్చినట్లు స్వప్నవృత్తాంత మున్నది గదా! హరిశ్చంద్రుఁడును, ఉషాకన్యయుఁ గల గాంచినారుగదా! ఇటీవలఁ గాదంబరీ దశకుమారచరిత్రాదులలోఁ దత్ప్రసంగ మున్నది గదా! కనుకఁ దిమ్మకవికిఁ దనయిష్టదైవమే గురువుగా వచ్చి వేదాంతమును బోధించె ననుట సత్యమనియే భావింతము.
ప్రబంధనిర్మిమీష
| "ఏకశ్శబ్దస్సుప్రయుక్తస్సమ్యజ్జ్ఞాతస్స్వర్గే లోకేచ కామధుగ్భవతి" | |
(సుష్ఠురూపముతో నొక్కశబ్దమును బ్రయోగించినవాఁడును, ఒక్కశబ్దమును లెస్సగాఁ దెలిసికొనినవాఁడును స్వర్గమునందును, నిహలోకమునందును నభీష్టఫలభాజకుఁ డగుచున్నాఁడు) అని శ్రుతి. సాహిత్యదర్పణములో విశ్వనాథకవిరాజు కావ్యమహిమను దెల్పుచు