పుట:సత్యభామాసాంత్వనము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

సత్యభామాసాంత్వనము

తే. నౌర ఘనుఁ డనఁ దగు జపాటీరశాటి
     కాతటవటత్కరటిలోక కర్ణయుగళ
     దళనపటుతరధణధణంధణనినాద
     కటుపటహకోటి ముద్దులళ్ఘరికిరీటి.

శా. స్ఫారప్రాభవముద్దులళ్ఘరినృప ప్రౌఢస్ఫురద్బాహుగం
     భీరాసిక్షతవైరివీరు లవనిన్ భీతిం గరివ్రాతశుం
     డారేఖం దగఁ దూఱి పచ్చికలబైటం బాటి రాఁజూతురౌఁ
     దూఱుం దుండముపాఱుపచ్చి కనితోడ్తోనవ్వ భిల్లాంగనల్.

సీ. వేరుచేసి యొసంగు విబుధోపవనశాఖి
                    తనవేలఁ గాచిన వనధి యొసఁగుఁ
     గాసు గైకొని యిచ్చుఁ గమలినీపతిపట్టి
                    మేఘ ముద్ఘోషించి మెఱసి యొసఁగు
     దరిఁ బాలు పొమ్మని సురసురభి యొసంగు
                    మాపు రే పని యిచ్చు మరునిమామ
     యెమ్మె మీఱ నొసంగు నంతయును దధీచి
                    తులఁ దూఁచి యల శిబీంద్రుం డొసంగు
తే. ననుచుఁ దొలుతటిదాతల నపహసించి
     నిత్యవిశ్రాణనస్ఫూర్తి నెగడ మిగుల
     జగతిఁ దగుశాత్రవదురాపచాపరోప
     కలితజయహారి ముద్దులళ్ఘరిమురారి.

ఉ. శ్రీపతి యల్లముద్దళఘరిప్రభుఁ [1]డయ్యె మహోన్నతుల్ దగన్
     భూపతి యౌట యంత రహిఁ బొల్చుక్షమన్ భుజసీమఁ దాల్పఁగా
     నాపగ నంతకన్నఁ బొడవై తగునట్టి తదక్షికోణమున్
     ప్రాపుగ నెంచి నిల్చె వనరాశితనూజ యహంక్రియోన్నతిన్.

మ. జలవంశంబునఁ బుట్టి రట్టు నతిచాంచల్యాయశంబు న్జనన్
     మెలఁగం గోరి విశుద్ధవంశమున లక్ష్మీదేవి లక్ష్మీసతీ

  1. డై జనియించితాఁ దగన్