పుట:సత్యభామాసాంత్వనము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

సత్యభామాసాంత్వనము

తే. యరుదుమీఱఁగ నరిదియై యగదుఁ డగుచు
     మఱియు నబలానురంజనమహిమఁ జెంది
     యెంతయుఁ జెలంగె నభినవకృష్ణుఁ డనఁగ
     విశ్వనాథేంద్రు పెదకృష్ణవిభువరుండు.

ఉ. ఆ పెదకృష్ణభూవర కులాగ్ణికిన్ జనియించె సంతత
     ప్రాతితకీర్తిహారి సుకృతానుగతైకసతీవిహారి త
     ద్భూపవతంసముక్తిపరిపోషణతోషితశేషభోగి వా
     ణీపతి పెద్దవీరధరణీపతి కోపతిరస్కృతారియై.

సీ. ఆహవధరణియం దతిరౌద్రగతి మించి
                    దక్షారిశీర్షనిర్దళనఁ జేసి
     వితతజడిమఁ దాల్చు విద్వేషరాజమం
                    డలము పదాతిఘట్టనలఁ జదిపి
     పటుమహోదంతానుబంధంబు వీడంగ
                    నను హృదినాననాహతి యొనర్చి
     చిత్రంబుగను వినాసికయౌవిధము దోఁప
                    [1]విమతవివాణిని విస్తరించి
తే. వితతవిశిఖాప్తకాలికావిలసనంబు
     బహుకరావాప్తి యనఁ జాలఁ బరిఢవిల్లఁ
     గీర్తి చేకొనె [2]నుద్దండమూర్తి కృష్ణ
     విభునివీరుండు రెండవవీరుఁ డనఁగ.

మ. అదనన్ శ్రీపెదవీరశౌరి యరియాహాకారలో నుండ నిం
     డుదయన్మోహపురాణి తా సవతి బోటుల్ చూడ నీకొంకు లా
     పెదవీరాతనియించువా రని రతాప్తిన్ దృప్తి చేకూర్చె నా
     నదరన్ గుండియ వాని కవ్విభుని పేరై యానుడే తోఁచెనో?

క. ఆవీరవిభుఁడు తిరుమల
     దేవీరమణీయలీలఁ దేలుచు విశ్వో

  1. విమతవాణిధృతి
  2. నసదృశస్ఫూర్తి