పుట:సత్యభామాసాంత్వనము.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

165

     లోకంబున ననవరతము
     శ్రీకాంతునికరుణవలనఁ జేకుఱు శుభముల్.

క. అని భక్తిని వైశంపా
     యనముని వినిపింప వినుచు హర్ష మెసంగన్
     జనమేజయధరణీంద్రుఁడు
     ఘన మొప్పఁగ వెలసె నిత్యకల్యాణములన్.

మ. వసుధాఖండల ఖండలగ్నమధురత్వత్రాణపారీణసూ
     క్తిసుధాకందళ కందలక్షనయభాగ్విశ్రాణసంపద్విమా
     నసభాసద్బుధ సద్బుధప్రవరగంధర్వస్వరోదారమా
     నసమంజూత్పలసత్వరస్థగితమాద్యద్రాజచూడామణీ.

క. చందయవనాళికాక్షర
     కుండలనోద్భవ్యదండకోదండభుజా
     దండధృతమండలాగ్రవి
     ఖండితరిపుగళవిఖండ గండరగండా.

క. దాక్షాయణీదయారస
     వీక్షార్జితరాజలోకవిశ్రుతశీలా
     పక్షాంతచంద్రవదనా
     లాక్షాంకితఫాలభాగ లక్ష్మీశీలా.

[1]కవి. వినుతకృపావన రమ్యకృపావన
                    విభ్రమపావనదృక్కమలా
     తనురుచిమానససంభవ మానస
                    దాసామానసమగ్రయశా
     వననిధిసారసనాధిపసారస
                    వక్రమసారసఘనవిభవా
     వనజభవాసనవారిజగడ్యుతి
                    వారిజనారజయాభ్యుదయా.

  1. ఈకవిరాజవిరజితము లక్షణవిరుద్ధముగా నున్ననూ ప్రత్యంతరములేమి యథామాతృకగాఁ బ్రకటించితిమి.