పుట:సత్యభామాసాంత్వనము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

సత్యభామాసాంత్వనము

సీ. అంగనామణి యైన యల్లరుక్మిణి యుండ
                    యువతి యైనట్టిజాంబవతి యుండ
     నసమానలక్షణ యల్లలక్షణ యుండ
                    గాంత యైనట్టిసుదంత యుండ
     [1]సువచోభినందన సూర్యనందన యుండ
                    నందగత్తియ మిత్రవింద యుండ
     ననిశసేవోన్నిద్ర యగుభగ్ర యుండంగ
                    నాధాశయజ్ఞ యౌ రాధ యుండ
తే. మఱియు వేవేలగరితలు మానవతులు
     స్వామినగరను గల రైన నారిలోన
     నెవ్వతెఁ దలంచ కయ్యయో గవ్వ యైన
     సత్యఁ దలపోసి చాలవాచార నేల.

మ. అప్పుడే సామివెంట నమరారియొనర్చురణంబుఁ జూడఁగాఁ
     గప్పురగంధి వత్తు నన గ్రక్కున రమ్మన కింకి నీడ కీ
     విప్పుడు రాఁదలంచితివి యేతయుఁ బూవిలుకాఁడు మాయచే
     గప్పుచు [2]గప్పుచి ప్పనుచుఁ గల్వలకోరులు కుప్పళించినన్.

సీ. వెలఁదివాతెర యానువితముగా నీమోవి
                    నీవె యానుచు గ్రుక్క నించుసొక్కు
     తరుణిఁగౌఁగిటఁ జేర్చు హరువున నీఱొమ్ము
                    నీవె కౌఁగిటఁ జేర్చు నిండుతక్కు
     అతివకాళ్లకు మ్రొక్కునట్లు నీపదముల
                    నీవె వ్రాలుచు నంటునీటు మ్రొక్కు
     పడఁతిచెక్కులు చీరువడువున నీచెక్కు
                    నీవె చెనక గోర నినుచునెక్కు
తే. నిందుముఖి సందుచేసిన యంద మొంద
     నీతొడలు నీవె కదియించు నేర్పుటెక్కు

  1. సువచనానందన
  2. గప్పు తెప్పనుచుఁ