పుట:సత్ప్రవర్తనము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుభవార్త.

మహాశయులారా!

సత్ప్రవర్తన మను పేరఁ బరఁగు నీచిట్టి పొత్తమును మీకర్పింపఁ జాలితి. ఇరువది రెండు వత్సరములపాఠశాలానుభవముగల నే నీ పుస్తకము వ్రాయ నర్హుఁడనని మీరు సమ్మతింతురని నమ్మెదను. ఇందు సత్ప్రవర్తనమహిమము పలువిధములగు నుదాహరణములచే విమర్శింపఁబడినది. దీనియం దపూర్వములగువిషయములు నోపికమైఁ బరీక్షించి వ్రాసితినని చెప్పుకొనఁదగిన విషయము లెవ్వియును లేవు. కాని నాపరిశ్రమ మెంతవఱకు సుహృదయుల యాదరణమునకుఁ బాత్రమగునో పరికించు నూహ కలదని మాత్రమే చెప్పుకొనఁదగినది. విద్యార్థులు చక్కఁగా మది నిల్పుకొనఁ దగిన విషయము లిందెదాన్నియేని కలవు. వృద్ధికాములగు బాలురకేయేమార్గములు ప్రవర్తింప నర్హములో యవి యిందుఁ దెలుపఁబడినవి. పెద్దలు బాలుర కిద్దాని బాఠ్యముగా నిర్ణయించిన మేలని తోఁచిన నట్లు చేయుదురుగా యని కాంక్షించుచున్నాఁడను. పెద్దల యాదృతికిఁ బాత్రమగునేని నాయీ ప్రయత్నము సఫలమగును.

నే నీ పుస్తకము వ్రాసి పంపఁగనే శ్రద్ధగా ముద్రించి నాకొసంగిన మ. రా. శ్రీ ఈదర వెంకయ్యపంతులు గారికి నాకృతజ్ఞత నేతనుఖమునఁ దెలుపుకొనుచున్నాఁడను. నన్ను