పుట:సకలనీతికథానిధానము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

77


వ.

అని చనుటయు నారాత్రి యతనికడకుం జని యతని యనుమతి మౌనస్థుండయి దన్నికటవటజటలో దగిలి తలక్రిందయి వ్రేలుచున్న బేతాళునిం బట్టి కట్టి మూపున బెట్టుకొని వచ్చునప్పుడు.

83


క.

బేతాళుఁ డనియె వినుమో
భూతలవర మనకు నుబుసుపోకకు కథ లా
ఖ్యాతము చేసెద బ్రశ్నో
పేతంబుగ నుత్తరంబు లీవలయుజుమీ.

84


వ.

ఆప్రశ్నల కెఱింగి యుత్తరం బీకున్న వజ్రాయుధంబు తలద్రెంచు ననుచు గథ జెప్పదొడఁగె నది యెట్టిదనిన.

85


సీ.

(కర్ణోత్పలం) బనఁగల దొక్కనగరంబు
        తత్పురివరుఁడు ప్రతాపమకుటుఁ
డు రాజు వానికి నాత్మజన్ముఁడు వజ్ర
        మకుటుఁడునను సుకుమారమూర్తి
తన్మంత్రిపుత్రుండు దారుండు బుద్ధిశ
        రీరుఁ డాతఁడు సహచారి గాఁగ
విపినంబునకు వేట వెడలి తన్మధ్యకా
        సారంబునను నొక్కజలజవదన


తే.

యంబుకేలి జరింప నయ్యధిపసుతుఁడు
మదనపరవశుఁ డగుచు నాసుదతి జూడ
లలనకరకమలమున కమలము డిగిచి
జిలుగుశృంగారచేష్టలు చేయదలఁచి.

86


వ.

కమలద్వయంబు కర్ణద్వయంబు మోపిపుచ్చి[1] దంతంబుల ఖండించి చరణయుగళంబున వైచి మఱియొక్కకమలంబు కుచంబుల నదిమి కంపించి తలయూచి పురంబున కరిగిన వజ్రమకుటుం డవ్విధంబు సచివపుత్రునకుం జెప్పిన నతం డిట్లనియె.

87
  1. మానిపుచ్చి