పుట:సకలనీతికథానిధానము.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

సకలనీతికథానిధానము


ఆ.

పిన్నపత్నిమీఁది ప్రేమను భూపతి
తత్తనూజు రాజ్యతంత్రమునకు
భర్తఁ జేయ పెద్దభార్యకుమారుండు
చిలుక గూడి కార్యచింత సేయ.

210


వ.

ఆశుకం బిట్లనియె.

211


మత్తకోకిల:

ఇంతయేటికి జింత యీపని యేన తీర్చెద నింక నీ
వంత మాన్చెదనంచు దచ్ఛుకవంశ్యు లారవకింకిణీ
వంతులై తను చేర నప్పుర వప్రవీధుల నిల్వ భూ
కాంతుఁ డెవ్వరటన్న నింద్రుని భావ్యదూతల మేమనన్.

212


క.

ఏమిపని వచ్చినారన
భూమీశ్వరయగ్రమహిషిపుత్రుని రాజ్య
శ్రీమహితు జేయుమని సు
త్రాముఁడు నీ కెఱుక చేసి రమ్మని పంపె.

213


తే.

అనిన నట్ల సేతునని కీరముల నంపి[1]
పెద్దవుత్రుని యువరాజ్యభృతునిఁ జేసి
చనిన సంతోషచిత్తుఁడై యనియె చిలుక
కతఁడు నీకిష్ట మెయ్యది యది యొనర్తు.

214


వ.

అనిన భవగుప్తు సొమ్మెల్ల పుచ్చుకొని తల గొరిగించి వెళ్ళగొట్టించు మనిన నట్ల చేసె గావున కీరం బుపాయకర్త యనిన భరద్వాజం బిట్లనియె.

215


సీ.

ఒకచెట్టుతొఱ్ఱలో శుకము పిల్లలఁ బెట్ట
        బోయయొక్కఁడు శుకపోతములనుఁ
గొనిపోవఁ జిలుక మ్లేచ్ఛునిఁ జూచి పలికెను
        శిశుఘాత మేటికిఁ జేసె దనిన

  1. ఈపాదము ఛంధోభంగముగా కాన్పించుకున్నది.