Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/875

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆర్షభూగోళము (1) దైవఖండము (2) గభస్త్యఖండము (8) పురుష ఖండము (4) భరతఖండము (5) శరభఖండము (8) గంధర్వఖండము (7) తామ్రఖండము (8) శేరుఖండము (9) ఇందు ఖండము, ఈ తొమ్మిది ఖండములలోను ఈ వరుసగా (1) దేవ (2) భూత (8) కింపురుష (4) మానవ (5) సిద్ధ (8) గంధర్వ (7) రాక్షస (8) య (8) పన్నగు లుందురు. తక్కిన వర్షములలో యుగములు లేవు. కాని భారత వర్షములో నాలుగు యుగములున్నవి. భరతునికి పూర్వము దీనికి హిమవర్షము లేక హైమవతవర్షము అని పేరుండెను. నాభి అనువాడు దీనిని పరిపాలించెను. దీనికి నాభివర్షమని కూడ పేరున్నట్లు గనబడుచున్నది. (వెన్నెలగంటి సూరన తెలుగు విష్ణుపురాణము) నాభికొడుకు ఋషభుని కుమారుడు భరతుడు. వానివలననే హిమవర్ష మునకు భారతవర్షమని పేరువచ్చినది. అజనాభమనియు దీనికి వ్యవహారముండేను. (భాగవత 5 స్కం.) ఋషభుడు. నగరుని కుమారులు జంబూద్వీపమును త్రవ్విపోయుట వలన (1) స్వర్ణ ప్రస్థము (2) చంద్ర శుక్లము (3) ఆవ ర్త నము (4)రవణకము (5) మందేహారుణము (6) పాంచ జన్యము (7) సింహళము (8) లంక అను ఎనిమిది ఉప ద్వీపము లేర్పడినట్లు భాగవత పురాణము తెలుపు చున్నది. ఆర్యభటుడు తన సిద్ధాంత శిరోమణిలో 'లవణ సముద్రమునకు ఉత్తరముగానున్న భూమిలో సగము జంబూద్వీపము. ఇక మిగిలిన సగములో ఆరుదీవులును, ఏడు సముద్రములును ఉన్నవి.' అని చెప్పెను. లవణ సముద్రము 2701 యోజనాలు, నిరక్షరేఖ మీద లవణ సముద్రములో లంక యున్నది. నిరక్షరేఖ మీద లంక, రోమకము, సిద్ధపురి, యమ (వ) కోటి అను పట్టణములున్నవి. ఈ నాలుగు పట్టణములకు పరస్పర దూరము భూవృత్తములో నాలుగవ వంతు. అనగా తొంబది యంళలు. లంకలో సూర్యోదయమైనప్పుడు యమ(వ)కోటిలో మట్ట - మధ్యాహ్నము. సిద్ధపురిలో అ సమయము. రోమకములో నడికిరేయి. దీని తెలివిడి యిది :- ఎనిమిది యినుపచువ్వలు గల యొక గుడ్డగొడుగును తెఱచి నిలువుగా నేలలో నిలుచు ద్వీపము పటము 2 నట్లు పెట్టుదము. గొడుగునడుమ ఆధారముగానున్న కఱ్ఱ మేరువు యొక్క పాతు అని యనుకొందము. గొడుగు మీదికి ఉబ్బెత్తుగా వచ్చిన కఱ్ఱకొన మేరువు. దానిచుట్టు నున్న చిన్న గుండ్రని గుడ్డముక్క ఇలావృతము. ఇనుప చువ్వల చివళ్ళచుట్టును గుండ్రముగా ఒక దారమును కట్టుదము. అదియే నిరక్షరేఖ. ఆ దారముతో కలిసి మన కెదురుగానున్న ఒక యినుపచువ్వకు ఒక ముత్యమును కట్టి దానిని లంక యందము. దానికి సమదూరములో మరిమూడు ముత్యములు కట్టి వానిని తక్కిన రోమక, సిద్ధపురి, యమ(వ)కోటి యను పట్టణము అని యందము. దారము క్రిందనున్న ఆకాశము లవణసముద్రము. గొడుగుకఱ్ఱ నలుదెసల నున్న గుడ్డయే జంబూద్వీపము. మన కెదురుగానున్న యినుపచువ్వకు ఈవలి యావలి రెండుచువ్వల నడుమనుండి ఎగువకఱ్ఱ కొసవరకును గల ప్రదేశము భారతద్వీపము. దీనిని మూడుగా విభజించి క్రింది భాగమును, లంకను ఆశ్రయించియున్న దానిని, భారత .వర్షమని గుర్తింతము. ఈ రీతిగా పురాణములలో చెప్పబడిన జంబూద్వీపము, భారత వర్షము - ఆర్యభటుడు చెప్పిన జంబూద్వీపము, భారతవర్షము సరిగా సరిపోవుచున్నవి. 3. 8. r. 800