Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/856

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్యభటుడు

నేర్పాటుచేయుటయేగాక సాంకేతిక ప్రవీణ వ్యక్తులలో నిరుద్యోగ నిర్మూలనకై సహకారకృషి కేంద్రముల స్థాపనకు ద్యమించినది, గ్రామసీమలలో పరిశ్రమల నెలకొల్పు ప్రణాళికలో గ్రామీణ కర్మకారుల సహకారము పొందుటకై విద్యుచ్ఛక్తితో నడుపబడు యంత్రముల వినియోగించు గ్రామీణ కర్మకారులకు తరిఫీదు ఇచ్చుచున్నది. అనేక జలప్రణాళికల మూలమున వివిధ ప్రాంతములకు విద్యుచ్ఛక్తి సరఫరా కానున్నది. చిన్న పరిశ్రమలను, గృహపరిశ్రమ లను నవీన పద్ధతులు అవలంబించునట్లు చేయుట కిది అపూర్వతరుణము.

వ్యవసాయాభివృద్ధికి ప్రణాళిక వేయుటలో అనుసరించవలసిన ప్రధానసూత్రములు పైన సూచింపబడినవి. పర స్పర సమన్వయము, ఐక్యతగల ప్రణాళిక మనకు కావలసి యున్నది. మున్ముందు పెక్కు సంవత్సరముల వరకు వ్యవసాయము మనప్రజల ప్రధాన జీవనోపాధియై యుండుట తప్పదు. ఈనాడు అది లాభసాటి కాని పరిశ్రమ. అట్లుగాక అది రైతుకు గిట్టుబాటుగా నుండుటకు చర్యలు తీసికొనవలెను. వ్యవసాయమునుగూడ మనమొక పరిశ్రమగానే పరిగణించిననాడే అది సాధ్యమగును.

ఆర్. వి. రా.

ఆర్యభటుడు  :- భారతీయ జ్యోతిశ్శాస్త్రములో అర్ష సిద్ధాంతముల తరువాత శాస్త్రీయ సిద్ధాంత గ్రంథములను రచించినవారిలో ఆర్యభటుడు మొదటివాడుగ చెప్పబడుచున్నాడు. ఇతడు క్రీ.శ. 476 లో జన్మించినట్లు తన గ్రంథములోని ఈ శ్లోకమువలన తెలియగలదు.

శ్లో, షష్ట్యబ్దానాం షష్టి ర్యచా
       వ్యతీతా స్త్రయ శ్చ యుగపొదాః
త్య్రాధికా వింశతి రబ్దాస్త
       దేహ మమ జన్మనో ౽తీతా!

(కాలక్రియాపాదము 10)

అనగా ఈ వైవస్వత మన్వంతరములో మూడు యుగ పాదములగు కృత, త్రేతా, ద్వాపరములును, నాలుగవ పాదమగు కలిలో 60 × 60 ( 3600) సంవత్సరములు తన గ్రంథారంభము నాటికి గడచినవనియు, అప్పటికి తనకు ఇరువది మూడు సంవత్సరములు నిండినవనియు

అర్థము. దీనినిబట్టి అతడు శా. శ. 398 (క్రీ.శ.476) జన్మించి శా.శ. 421 (క్రీ. శ. 499) లో తన గ్రంథమును రచించెనని స్పష్టము, గణితపాదములోని ప్రథమ సూత్రమునందలి 'కుసుమపురే' అను పదమును బట్టి ఈతడు పాటలీపుత్రమునకు సంబంధించిన వాడని విదితము.

ఇతడు రచించిన గ్రంథము "ఆర్యభటీయ" మని వ్యవహరింపబడుచున్నది. ఇది భారతదేశమందలి మొట్టమొదటి అనార్హమగు జ్యోతిశ్శాస్త్రగ్రంథము. తన గ్రంథమునకు మూలభూతమైన ప్రాచీన పరిజ్ఞానమును గూర్చి ఆర్యభటుడిట్లు చెప్పెను.

శ్లో, సదసజ్ జ్ఞాన సముద్రా
       త్సముద్ధృతం దేవతా ప్రసాదేన,
సత్ జ్జ్ఞానో త్తమ రత్నం
       మయా నిమగ్నం స్వమతినావా.

ఈ శ్లోకమునుబట్టి ఆర్యభటుడు తవనాటికి వాడుకలోనున్న బహుళ జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయములను తన బుద్ధి విశేషముచే పరిశీలించి వాటియందలి దోషములను పరిహరించుచు యథార్థమగు ఖగోళ సిద్ధాంతములను రచించెనని తెలియుచున్నది. జ్యోతిశ్శాస్త్ర నిర్ణయములు ప్రయోగ పూర్వక పరిశోధనములతోనే సాధ్యపడునవి యగుటచే అతడట్టి పరిశోధనలను సలిపియే శాస్త్రీయములగు సిద్ధాంత ఫలితములను పొందగలిగెనని విదితమగు చున్నది. అతడు తన గ్రంథములో పరిశోధన ఫలితములను సూత్రప్రాయముగా చెప్పియున్నను అందుకు ప్రధాన అంగమగు గణితమును ప్రత్యేకించి చెప్పెను. ఈవిషయమతని స్వతంత్ర పరిశోధనముల ప్రాముఖ్యమును వెల్లడించును. పాండురంగస్వామి. లాట దేవుడు, నిశ్శంకుడు, మొదటి భాస్కరుడు మొదలుగాగల శిష్యులు పెక్కురు ఇతని యొద్ద పరిశోధనాత్మక శాస్త్రము నభ్యసించినట్లు ప్రతీతికలదు. ఈ గ్రంథములో చెప్పబడిన ఖగోళ స్థిరాంకముల తులనాత్మక పరిశీలనమును బట్టి ఆర్యభటీయము స్వతంత్రగ్రంథమే అని స్పష్టమగుచున్నది. మరియు భారతీయ జ్యోతిశ్శాస్త్రము గ్రీకు సంప్రదాయము యొక్క అనుకరణమను పాశ్చాత్య విమర్శకుల వాదము అపాప్తమగుచున్నది. ఆర్యభటుడు తన సరి