Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/836

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయుర్వేద ధర్మములు


95. "న భయ ముత్పాదయేత్." వట్టి అల్లరులను బుట్టించి జనులను భయ పెట్టరాదు.

96. "న సాహ సాతిస్వన్న ప్రజాగర స్నాన పానా శనా న్యానే వేత.” తన శక్తికి మించిన పనిని చేయ బూనుట, అధిక ముగా నిద్రించుట, మేల్కొనుట, స్నానము చేయుట, నీళ్ళు త్రాగుట, భుజించుట యనునవి చేయరాదు.

97. "నోర్ధ్వబాహు శ్చిరం తిష్టేత్ ఎక్కువ కాలము గొంతు కూర్చుండరాదు. (మునిగాళ్ళపై కూర్చుండ రాదనుట.)

98. "న వ్యాఖా నుపసర్వేత్.

99. "న దంష్ట్రాణః.

100. "నవిషాణినః." పాములను, కోరలు గల క్రూరజంతువు లను, నిడివియు వాడి యునైన కొమ్ములుగల జంతువులదరి జేరరాదు.

101. "పురోవాతాత పావశ్యాయతీవ్రవాతాన్ జహ్యాత్.” ఎదురు గాలిలోను, ఎదురెండయందును, మంచి మంచు నందును, పెద్దదగు ఎదురుగాలియందును పోరాదు.

102. "కలిం నారభేత." అనవసరముగా ఇతరులతో తగవులాడరాదు.

103. "నాసునిభృతోగ్ని ముపాసీత.”

104. “నోచ్ఛిష్ట నాధఃకృత్వా ప్రతాపయేత్." అజాగ్రత్తగా అగ్ని నారాధింపరాదు. అగ్నిని నోటితో నూది రగుల్కొల్పరాదు. స్థండిలము లేక వట్టిచోట అగ్నిని ప్రజ్వలింప చేయరాదు.

105. "నావిగతక్షమః నానాప్లుతవదనః ననగ్న ఉపస్పృశేత్ ." బడలిక చెందియు, ముఖము కడుగుకొనకయు, దిగంబరుడయ్యును స్నానము చేయరాదు.

106. "న స్నానశాట్యా స్పృశే దుత్తమాంగమ్” స్నానముచేసిన బట్టతో తల తుడుచుకోరాదు.

107. “న కేశాగ్రా ణ్యభిహన్యాత్" తలవెండ్రుకలను జాడింపరాదు.

108. "నోపస్పృశ్య తఏవ వాసనీ బితృయాత్” కట్టి విడచిన బట్టలను తిరిగి కట్టరాదు. '

109. "నాస్పృష్ట్వా రత్నాజ్య పూజ్యమంగళ సుమనోభి నిష్క్రమేత్" ఇంటినుండి బయలుదేరునపుడు రత్నములు, నేయి, గోవు, పూజ్యములు, మంగళకరములు నగు ఇతర ద్రవ్యములు, పువ్వులు ఎదురైనచో వానిని చేతులతో తాకి వెళ్ళ వలయును.

110. "నపూజ్య మంగళా న్యపసవ్యం గచ్ఛేత్" పూజ్యములగు గోవులు మంగళకరములగు ఇతర ద్రవ్యములు ఎదురైనపుడు వాటికి ప్రదక్షిణముగా వెళ్ళ వలయును. (గౌరవనీయులగు వారికందరికి ప్రదక్షిణి కృతముగా ఎడమవైపుగా వెళ్ల వలయును.)

111, "నేతరా ణ్యనుదక్షిణం" అమంగళములగు ద్రవ్యములు, శవము, మున్నగునవి ఎదురైనపుడు వాటికి అప్రదక్షిణముగా వెళ్లవలెను. (కుడిభాగమున వెళ్లవలయును.)

112. (1) "నారత్న పాణి” చేత రత్నాంగుళీయకములను ధరింపకయు,

(2) “నాస్నాతః” స్నానము చేయకయు,
(3) “నోపహత వాసాః” ఉతికిన బట్టలు కట్టుకొనకయు
(4) “నాజపిత్వా సంధ్యాది ఉపాసన చేయకయు
(5) నాహుత్వా దేవతాభ్యః" దేవతలకు ఆహుతులు వేయకయు
(6) “నానిరూప్య పితృభ్య" మాతా పితరులకు పెట్టకయు
(7) "నాదత్వా గురుభ్యః" పూజ్యులను ముందు భుజింప చేయకయు
(8) “నాతిథిథ్య!” అతిథుల కీడకయు
(9) “నోపాశ్రితేభ్యః”అనుసరించుకొనియున్న వారిని భుజింప జేయకయు
(10) “నాపుణ్యగన్ధః" సుగంధ ద్రవ్యముల నలందు కొనకయు
(11) “నామాలీ” పుష్పధారణ చేయకయు
(12) “వాప్రక్షాళిత పాణిపాద వదనః" చేతులు, కాళ్ళు, ముఖము కడుగుకొనకయు
(13) “నా శుద్ధముఖ” చక్కగా పుక్కిలించి యుమియకయు
(14) “నోదఙ్ముఖః" ఉత్తరాభిముఖముగా కూర్చుండియు
(15) “నవిమనాః" మన స్తిమితము లేకయుండియు