ఆయుర్వేద గ్రంథములు
నందును కన్పట్టుచున్నది. ఉదా :- ఆయుర్వేదమును గూర్చి బోధించు కొన్ని వేదభాగములు.
గర్భమును గూర్చి తెలియవలసిన యంశములు గర్భోపనిషత్తునందు వర్ణింపబడినవి. ఋగ్వేదములో 10. వ. మండలము, 184. వ. సూక్తములోను, ఐతరేయ బ్రాహ్మణములోను, ఈ విషయము వర్ణింపబడియున్నది.
శరీరమునకు పంచభూతములు కారణములని ఋగ్వేదము 10 మం - 16 సూ 3 - 7 ఋక్కులలోను, తైత్తరీయోపనిషత్తు నందు గల బ్రహ్మవల్లియందును, కానవచ్చును.
శరీరమునకు మూలమైన వాతపిత్త శ్లేష్మములను గూర్చి ఋగ్వేదము 1 మం - 34 సూ - 6వ ఋక్కు నందు "త్రిధాతు శర్మ యచ్ఛతం" అని యున్నది. ఇచ్చట 'త్రిధాతు' శబ్దమునకు వాతపిత్త శ్లేష్మములని శ్రీ విద్యారణ్యస్వామి భాష్యమును రచించిరి. శరీరాంగ ప్రత్యంగములనుగూర్చి ఋ గ్వేదములోను, ఐతరేయ బ్రాహ్మణములోను వర్ణనలు కన్పట్టును. శరీరశాస్త్రమును గూర్చియు ఋగ్వేదము 10 మం - 97 సూ - 6వ ఋక్కులో వ్రాయబడి యున్నది. రోగములను గూర్చియు, వాటి చికిత్సలను గూర్చియు ఋగ్వేదము 10 మం - 168 సూ లోను, ఐతరేయ బ్రాహ్మణము లోను, యజుర్వేద సంహిత - 2 అ 3 పన్నం. 5 అను నందును గాన వచ్చును.
చికిత్సలకు ఉపయోగించు ఓషధులను గూర్చి ఋగ్వేదము 9, 10 మండలములలోను, యజుర్వేదమునందు బ్రా - 2 కాం - 4 ప్ర - 4వ అను -నందును, అధర్వణ వేదమునందును వర్ణింపబడెను.
అధర్వణ వేదమునందలి ఆయుర్వేద విషయ సంగ్రహము :- అధర్వ వేదము 1వ కాండ - 2వ సూ- నందును, 6వ కాం - 44వ సూ - నందును ఉదరామయ, అమాశయాది రోగశాంతికి ముంజగడ్డితో బంధనము చేయవలయు ననియు, కోష్ఠబద్ద. ప్రస్రావ నిరోధములకు 1 కాం - 3 సూ - లో ఎనిమావంటి సాధనము ఉపయోగింపవలయు ననియు చెప్పబడెను. అధిక రజస్స్రావ, రక్తస్రావములకు 1 కాం - 17 సూ. - లో జపము చేయవలెనని చెప్పబడినది. 1 కాం - 22వ సూక్తములో హరిద్రా అను మూలిక పాండురోగ నివారకమని చెప్పబడెను. 1 కాం - 23, 24 సూ - లలో శ్వేతకుష్ఠమును, నీలి- హరిద్రా - భృంగరాజ, ఇంద్ర వారుణులు అను ఓషధులు హరించు నని చెప్పబడియున్నది. 1 కాం - 25 సూ - 5 కాం -4-22 సూ-6 కాం- 20, 95, 3, 102, 116, 19, 39 సూ లలో ఏకాహిక, ద్వ్యాహిక, అన్యేద్యుష్క వరేద్యు రుభయద్యురాది వివిధజ్వర లక్షణములు, తక్మణ అను జ్వర లక్షణములు చెప్పి, బలాస అను కాస తక్మణకు అన్నగా రనియు బహు ప్రయాస సాధ్యమనియు చెప్పి, పైసూక్త మంత్ర జపాదులను వివరించెను. "అథ భై షజ్యాని" అని ఆరంభించి "లింగో న్మూలనం భైషజ్యం" అనగా రోగ కారణోన్మూలన మే భై షజ్యమనియు, కారణనాశక మే కార్యనాశక ము కావున కారణాన్వేషణము చేయుట ముఖ్యమనియు నిరూపించుచు 1 కాం - 12 సూక్తములో విద్యుత్తు అను అగ్నికి శిరఃపీడను, కాస-జ్వరాదులను కారణముగా చెప్పుచు కుష్ఠము అను ఓషధి సర్వజ్వర కారణహరముగా తెలియజేయబడెను. 4 కాండలో నష్ట వీర్యోద్ధరణము నకు కపిత్థకమే ఓషధియనియు, 4 కాం- 2 సూ - లో క్షతారోగ్యమునకు అరుంధతి అను లతను, తల్లతా నిష్పత్తి స్థానములుగా అశ్వత్థ - ప్లక్ష - ఖదిర - న్యగ్రోధములను వర్ణించెను. 6 కాం - 109 వ సూక్తములో క్షతారోగ్య సాధకముగా పిప్పలి వర్ణించబడెను. 6 కాం - 19 సూక్తములో అపామార్గయను ఓషధి సమస్త ఓషధులకు రాజుగా వర్ణించబడెను. 6వ కాం 90వ సూక్తమున బలాన అను వ్యాధి నివారణకొరకు జపించవలయుననియు 6వ కాం - 25, 127వ సూ- లలో చోప్రద్రు అను ఓషధి 'సర్వరోగ ప్రశమనము చేయ సమర్థమైనదనియు చెప్ప బడెను. 6వ కాం 136, 137 సూ లలో నితత్ని, శమి అను లతలను కేశవర్ధకములుగా చెప్పుచు, జీర్ణ కేశములను దృఢపరచుట, అజాత కేశ జననము, జాత కేశ దైర్ఘ్య సంపాదనము, దీర్ఘకృత కేశములకు కృష్ణ వర్ణకల్పన మున్నగునవి వర్ణింపబడినవి. 19వ కాం- 35వ సూ నందున, 2వ కాం- 4వ సూ - నందున గుల్గుల మను ఓషధి మధుమేహ నివారకమని చెప్పబడినది. ఇంకను జలోదరము, గండమాల, సంధ్యాత్వము