ఆఫ్ ఘని స్థానము
ఆఫ్ ఘనిస్థానము :- (చరిత్రము) :- ఆఫ్ ఘనిస్థానము ఇరేనియను పీఠభూమిలో ఈశాన్యదిక్కున ఉన్నది.
ఈ దేశపు సరిహద్దులు ఉత్తరమున ఆక్సస్, మధ్య ఆసియాలోయలు, తూర్పున ఉత్తర హిందూస్థానము, పడమట పర్షియాదేశము, దక్షిణమున బెలూచి స్థానపు టెడారి. ఆఫ్ ఘనిస్థాన మను పేరు 18 వ శతాబ్దములో అహ్మద్ షా రాజ్యకాలమునుండి స్థిరపడినది. ఈ దేశము నందలి ముఖ్యజాతులు - ఆప్ ఘనులు, పఠానులు, ఘిల్జాయిలు, టర్కోమనులు, ఇత్యాదులు.
చారిత్రకముగ ఆఫ్ఘనిస్థానములో భాగములైన ఖురాసాన్, కాబూలు, బాక్ట్రియా, గజనీ, కాందహారు, హీరట్ - అనునవి. గ్రీకుల, అరబ్బుల రాజ్యములలో రాష్ట్రములుగ నుండెను. క్రీ.శ. 1000 ప్రాంతమున గజనీ రాజులు, తర్వాత ఘోరి రాజులు ఇచట పరిపాలించి హిందూ దేశము పై దండయాత్రలు సాగించిరి. ఢిల్లీలో ముస్లిము రాజ్యము స్థాపించిన బానిసరాజు కుత్బుద్దీన్ ఐబక్ ఆఫ్ ఘని స్థానము వాడే. క్రీ శ.1526 లో బాబరుమొగలు సామ్రాజ్యము స్థాపించు వరకు ఆఫ్ ఘన్ స్థానము నుండి తురకల దండయాత్రలు పరంపరగ హిందూదేశమును బాధించుచుండెను. మొగలుకు సరియైన పేరు. చగతాయి. వీరి స్వదేశమగు ఫెర్గినా ఆప్ ఘనిస్థాన మందే యుండెను.
ఆవ్ ఘను చరిత్రలో కూడ అక్బరు రాజ్యకాలము (క్రీ. శ. 1556 - 1605) గొప్పది. ఆప్ ఘనిస్థానము ఇతని కాలములో ఢిల్లీ సామ్రాజ్యమున నొక భాగముగ స్థిరపడెను. అక్బరు రాజపుత్ర సైన్యములు జస్వంతసింగు సైన్యాధిపత్యమున ఆఫ్ ఘనిస్థానములోని తిరుగబాటులను అణచెను. ఔరంగజేబు తర్వాత ఆఫ్ ఘను సామంతులు స్వతంత్రము ప్రకటించిరి. క్రీ. శ. 1621 లో పర్షియనులు కాందహారును జయించిరి. క్రీ.శ. 1688 ప్రాంతమునుండి కాందహారును పర్షియనులు కాని, ఆఫ్ ఘనులు కాని పాలించుచు వచ్చిరి.
నాదిర్ షా ఆఫ్ ఘనిస్థానమును జయించి హిందూదేశముపై దండెత్తెను. ఇతడు క్రీ. శ. 1747 లో మృతి నొందెను. తర్వాత అహమ్మద్ అబ్దాలి స్థిరమైన ఆఫ్ ఘన్ రాజ్యమును స్థాపించెను. ఇతని రాజ్యము మెషెడ్ (Meshed) నుండి లాహోరువరకు వ్యాపించెను. క్రీ. శ. 1773 లో అహమ్మద్ షా చనిపోయెను. ఆతని పుత్రుడు తైమూర్ షా క్రీ. శ. 1793 వరకు పాలించెను. తైమూరుషా తరువాత అతని తమ్ముడు షాహ జమాను రాజ్య మేలెను. క్రీ.శ.1803 తరువాత షాహ మహమ్మదు, అటుపిమ్మట షాహ షుజా పాలించిరి. క్రీ. శ. 1827 నుండి 1863 వరకు దోస్త్ మహమ్మదు, తర్వాత షేర్ ఆలీ,తర్వాత అబ్దుర్ రహమాను, అతని కొడుకు హబీబుల్లా, మనుమడు అమానుల్లా పాలించిరి. తర్వాత నాదిర్ ఖాను. అతడు క్రీ. శ. 1933 లో చంపబడగా, జాహిర్ షాహ రాజయ్యెను.
అంతర్యుద్ధములలో ఆఫ్ మన్ సామంతరాజులు బ్రిటిష్ సాయమును తరుచుగ నపేక్షించుచుండిరి. మొదటి ఆఫ్ ఘను యుద్ధములో దోస్తుమహమ్మదు కాబూలు గద్దె యెక్కి హీరట్, కాందహార్ లను గెల్చెను. ఇతని పుత్రుడు గులామ్ హైదర్ బ్రిటిషువారితో సంధి నెరపెను. క్రీ.శ.1863 లో దోస్తుమహమ్మదు చనిపోగా అతని 16 గురు పుత్రులు సింహాసనమునకై పోరాడు