అనువంశికము
కాంక్రీటు మిశ్రమము | ఉత్పన్నమగు | నిరోధక శక్తి |
---|---|---|
1:1:2 | 3450 lbs. | 1 Sq. Inch. |
1:1½:3 | 2850 lbs. | 1 Sq. Inch. |
1:2:4 | 2250 lbs. | 1 Sq. Inch. |
సిమెంటు కాంక్రీటు శాస్త్రము చాల వృద్ధిచెంది యున్నది. దీనిని ప్రతి పనికిని అనుకూలముగా తయారు చేయుటకు వివిధ రకములైన యంత్రము లున్నవి.
కె.వి.యస్
ఆనువంశికము (Heredity):- ప్రపంచములోని ప్రాణికోటి, జీవిత కాలములో పలువిధములగు జీవన వ్యాపారములు సలుపుచుండును. వానిలో పునరుత్పత్తి యొకటి, దీనికి కారణము ప్రాణి చిరకాలము బ్రతికి యుండ జాలదు. కావున తన జీవిత పరిమాణము పూర్తి యగుటకు పూర్వము (పునరుత్పత్తి క్రియవలన) తనను బోలు సంతతిని వీడి నశించును. పునరుత్పత్తి క్రియయందు ఒక మానవునకు మానవుడే పుట్టుచున్నాడు. ఒక కుక్కకు కుక్కయే పుట్టుచున్నది. ఒక గేదెకు గేదెయే జనించు చున్నది. ఇవి సర్వవిధములు రంగు, రూపు, గుణములందు తమ తలిదండ్రులను పోలియుండును. తల్లిదండ్రులనుండి దేహదార్ధ్యము, మేధాశక్తి మొదలగు మంచిగుణములతో పాటు చెడ్డగుణములు సయితము సంక్రమించు చున్నవి. ఇట్లు తల్లిదండ్రుల గుణములు ఒక సంతతినుండి మరొక సంతతికి సంక్రమించుట అనువంశికము (Heredity) అనబడును. ఇందులో గుణముల సంక్రమణము పలువిధ ములుగనుండి వారసత్వము (inheritance) పై నాధారపడియుండును. కొన్ని గుణములు తల్లివి, మరికొన్ని తండ్రివి ఆయా సంతతిలో కాననగును. ఒక్కొక్కప్పుడు కొన్ని గుణములు ఒక సంతతిలో కనబడక రెండవతరము సంతతి (Second Generation) లో గోచరించును. ఒకే సంతతియందలి వివిధ వ్యక్తులందు పలువిధములగు వ్యత్యాసము లుండును. ఇట్టి వారసత్వమునకు కారణములు ఎంతో కాలమువరకు తెలియకుండెను. 18 వ శతాబ్దము వరకు దీనిని గురించి తెలిసికొనుటకు కృషి సలిపిన వారే లేరు. ప్రప్రథమమున 18 వ శతాబ్దపు మధ్య కాలమున కొందరు వృక్షములలో కృత్రిమ సంపర్కము (Artificial pollination) చే సంతతి బడయగలిగిరి. కానీ దానిని విశదీకరించరైరి. అటు తరువాత 19 వ శతాబ్దములో కృషి సాగించి కొందరు కొంతవరకు సఫలు లైనారు. వీరిలో ముఖ్యులు ఆగస్టు వైజ్ మన్ (August Weisman), గ్రెగర్ మెండెల్ (Gregor Mendel) అను వారలు.
ఆనువంశికమునకు భౌతిక మైన పునాది (Physical Basis of Heredity :) వైజ్ మన్ (Weisman) తన పరిశోధనల ఫలితముగ అనువంశికము (Heredity) నకు బీజరసము (Germ plasm) కారణమని 1892 వ సంవత్సరమున తెలియపరచినాడు. దీని నాతడు జీవరస సిద్ధాంతము (Germ Plasm theory) అని పేర్కొన్నాడు. జీవ పదార్థము (Proto plasm) ను రెండు తరగతులలో విభజించెను. అవి (1) పునరుత్పత్తి కణములందుండు బీజరసము (Germ Plasm) (2) దేహము యొక్క ఇతర కణములందుండు సొమాటోప్లాజమ్ అనునవి. పునరుత్పత్తి క్రియయందు పునరుత్పత్తికణములు అనగా శుక్రగోళకములు (Sperms) ను, అండము (Ova) లును పాల్గొనును, ఇతర కణములకు ఇట్టి క్రియతో ఎట్టి ప్రసక్తి లేదు. కావున ఆనువంశికమునకు కారణము పునరుత్పత్తి కణములందుండు జీవపదార్థమే అని వైజుమను తెలిపియున్నాడు. తదుపరి పరిశోధనలవలన ఫలదీకరణము (Fertilization) న పునరుత్పత్తి కణములందలి బీజము (Nucleus) ప్రధానమైనట్టిదనియు, ఇయ్యది లేనిచో కేవలము జీవపదార్థముతో ఫలదీకరణము జరుగనేరదనియు, జరిగినను పిండాభివృద్ధి కానేరదనియు ధ్రువపడినది. ప్రతిబీజము (Nucleus) లో ఒక వల యుండును. దీనిని అభివర్ణి (Chromatin net - work) వల యందురు. ఈపల కణవిభజన కాలమందు ముక్కలు ముక్కలుగా విడిపోవును. ఈ ముక్కలు పిత్య్రసూత్రము (Chromosomes) అనబడును. వీని సంఖ్య నిశ్చితమై (Definite) జీవుల యొక్క వివిధ జాతులందు వేరువేరుగా నుండును. ఈ పిత్య్ర సూత్రములను పరీక్షించగా ఇది పలువిధములైన ఆకారములు గలిగియుండునని తెలిసినది. వీటియందు ఒక జీవికి సంబంధించిన గుణములన్నియు నిలువును ఏర్పరచబడియుండును, ప్రతి పిత్య్ర సూత్రము (Chromosome) నందు ఒకదాని కంటె ఎక్కువ గుణములు ఇమిడి యుండును. ఒక పిత్య్ర .