ఆటవిక నృత్యరీతులు
రించి ప్రదర్శించెదరు. ఆరణ్యములలో నివసించు వీరికి ప్రకృతితోను, అందు నివసించు పశుపక్షాది జంతువులతోను సన్నిహిత సంబంధముండుటచే వీరు ఆ నాట్యము లందు ప్రదర్శించు అంగ విన్యాసము సహజముగా నుండును.
నృత్తము : నృత్తము వీరి కళ యొక్క జీవము. వీరి నృత్యకళ యంతయు వృత్తప్రాధాన్యమైనట్టిది, చక్కని లయతో గూడిన సుందరమైన అంగ విన్యాసము, ఆటవికుల నృత్య కళయందు మాత్రమే చూడగలుగుదుము . పర్వదినములందు పొంగు, కడలియందలి తరంగములవలె 'లయ' వీరి శరీరములో ప్రతి అవయవములో నుండి పొంగి ప్రవహించును. ఈ లయ, లయవిన్యాసము, శాస్త్రీయ నృత్యము నెరిగిన ప్రఖ్యాత నర్తకులందును, ఒకానొకపుడు కానమనుట సాహసముగాదు. ఆటవికుల నృత్యములకు ప్రత్యేకతాళములుండవు. సాధారణముగా వీరు గతుల నాధారముగా నృత్యమాడుదురు. త్రిశ్ర (3 అక్షరముల గతి) చతురశ్రము (4 అక్షరముల గతి) లాధారముగ వీరు విరివిగా నృత్యమాడుదురు. వీరిమృదంగ వాద్యము 'లయ' ను దెల్పుచు భావ ప్రధానముగా వాయించబడును. అనుకరణ నృత్యములందు, యుద్ధ నృత్యములందు వీరు ఆహార్యమును ధరించెదరు. వీరి నృత్యములు రెండు విధములు :- స్త్రీలు పురుషులు కలిసి చేసెడి నృత్యములు. పురుషులు, స్త్రీలు వేరువేరుగా చేయు నృత్యములు. మరియు వీరి నృత్యములన్నియు బృందనృత్యములే. వేణువు యొక్క రాగాలాపము వీరి నృత్యమునందు ముఖ్య సంగీతము. పాడుచు నాట్యమాడుట తరుచుగా వీరి నృత్యములందు కనిపించదు.
భారత దేశములో——తోడా, ముండా, బైగా, కురవ, చెంచు, కోయ, సుగాలి, బంజారా, గదబ, సవర, గోండు, భిల్లు, నాగ, ఒరియను మొదలయిన ఆటవిక తెగలెన్ని యో యున్నవి. వారందరి నృత్యరీతుల గురించి ప్రత్యేకముగా ఈ గ్రంథమందు వ్రాయుట అసాధ్యము. కాన వారందరికిని చెందిన కొన్ని ముఖ్యనృత్యముల వివరము అందు తెల్పబడు చున్నవి.
వేట నృత్యము (హల్బా) : హల్బా అను తెగవారు మధ్యప్రదేశ నివాసులు. హల్బాలు వేటాడు విధానము కళాత్మకముగా నుండును. ఏడెనిమిదిమంది కలిసి రాత్రి చిమ్మచీకటిలో వేటకు బయలుదేరెదరు. ఒకడు చిన్న దీపము తీసికొని ముందు నడచుచుండును. దాని నీడలో వెనుక భాగమున మిగిలినవా రుందురు. వారు కాళ్ళకు గుంగునియాలు (గజ్జెలందెలు) ధరించి యాడుదురు. వారు దీపపు నీడలో నిలబడి నృత్యముచేయుచు, లయతో అడుగులు వేయు చుందురు. అప్పుడు గుంగునియాలు "చు౯ చు౯ చు౯ చు౯" అనియు "చం చం చం చం" అనియు మధురధ్వని చేయుచుండును. ఆ మధుర ధ్వనులచే ఆకర్షితములై పొడలలో నిద్రించుచున్న కుందేటికూనలు అటుప్రక్కకు పరుగెత్తు కొనివచ్చి, దీపపు వెనుకనున్న మనుష్యులను జూడక, మినుకుమినుకుమని వెలుగుచున్న దీపకాంతిని జూచి ఆనందించుచు నిలుచుండును. అవి దీపము ముందునకు వచ్చినంతనే వెనుకనున్న మనుష్యులు వాటిని పట్టు కొనెదరు. ఇది వేటనృత్యము.
ఖర్మనృత్యము : గోండులు మొదలైనవారు పాడిపంటల అభివృద్ధికిగాను జేయు ఆరాధన నృత్యము ఖర్మ నృత్యము.
వర్ష ఋతు ప్రారంభములో (భాద్రపదము) గోండులు చిగిర్చిన 'ఇప్ప' కొమ్మను తెచ్చి, ఒక క్రొత్త గుడ్డలో చుట్టి యిండ్లలో నుంచెదరు. అనాడు పెద్ద పండుగ చేయుదురు. విందారగించిన పిదప భజంత్రీలు మద్దెలలు మ్రోగించు చుండ స్త్రీ పురుషులు కలిసి ఆ కొమ్మచుట్టు తిరుగుచు ప్రకృతి గీతములనో, ప్రేమగీతములనో పొడుచు నాట్య మాడుదురు. ఇదియే ఖర్మ నృత్యము. ఇది గోండులకేగాక యితర ఆటవిక జాతుల వారికికూడా ముఖ్యమైనట్టిది. ఈ విధముగా నృత్యగీతములతో ఖర్మవృక్షము నారాధించి, (బుజ్జిదేవ) భగవంతుని, ధర్తీ మాతను సంతోష పెట్టిన పంటలు బాగుగా పండునని వారి దృఢ విశ్వాసము.
ఈ రీతిగా కార్తీకము లేక మార్గశిర మాసములలో "భుయ్యా" తెగవారు ఒక ఖర్మవృక్షము కొమ్మను ఆడవి నుండి తెచ్చి దానిని పల్లెలోనుంచి దానిముందు ఖర్మ నృత్యము చేయుదురు. ఇట్టి నృత్య గీతాదులతో గూడిన ఆరాధనవలన ఇప్ప, మామిడి, పనస మొదలైన చెట్లు చక్కగా ఫలించునని వారి నమ్మకము. సోమ, బుధ,