ఆగమశా స్త్రములు
చ్చాస్త్రము, భాగవతాగమము అను నామధేయములు కలిగినవి. పాంచరాత్రమను నామధేయము మాత్రము - అనేక విధముల నిర్వచింపబడియున్నది. ఈశ్వర సంహిత యందు, భగవంతుని పంచాయుధాంశ సంభూతులగు నైదుగురు యోగులకు నైదు దివారాత్రములు ప్రత్యేకముగ నీశాస్త్రము నుపదేశించియుండుటచే “పాంచరాత్ర"మను వ్యవహారము గలిగినదని చెప్పబడియున్నది. పాద్మ సంహితలో, ఈ శాస్త్రమునకుముందు సాంఖ్యయోగాది పంచమహాశాస్త్రములు రాత్రివలె నిస్తేజ స్త్రములగుచున్న కారణమున పాంచరాత్ర మను వ్యవహారము దీనికి కలిగినది అని చెప్పబడియున్నది. విష్ణుసంహితయందు, రాత్రివలె అజ్ఞానాంధకార వర్థకములగు శబ్ద స్పర్శ రూప రస గంధము లను నైదు విషయము లును, లేక పృథి వ్యస్తేజో వాయ్వాకాశములను నై దుమహాభూతములును అనగా వానివలనగలుగు బంధము, పరమాత్మను సందర్శించినంతనే నశించి పోవును అని యుప దేశము నొసంగుచున్నందున దీనికి పాంచరాత్రమను వ్యవహారము గలిగినదని చెప్పబడి యున్నది. అహిర్భుధ్న్యసంహిత యందు, పర - వ్యూహ - విభవ - అన్తర్యామి - అర్చా స్వరూపములు అనుభగవంతుని పంచావస్థలనుగూర్చి తెల్పుచున్నందున, పాంచరాత్రమని దీనికి పేరు గలిగిన
దని - నిరూపించబడి యున్నది.
పాంచరాత్రముల యందలి అవాంతర విభాగము :-(1) ఆగమసిద్ధాంతము, (2) మంత్రసిద్ధాంతము (3) తంత్ర సిద్ధాంతము (4) తంత్రాంతర సిద్ధాంతము అని నాలుగు విభాగములున్నవి. మరియు న్యూన . మధ్యమ - ఉత్తమ భేదముల చేతను, దివ్య- అదివ్య భేదములచేతను అవాంతర విభాగములుకూడ నున్నవి.
ఈ పాంచరాత్ర సంహితల గణన అగ్నిపురాణము నందును, కపిలోంజలసంహితయందును, పాద్మ సంహిత యందును, విష్ణుసంహితయందును, హయశీర్ష సంహిత మొదలగు సంహితలయందును కొంచెము కొంచెము భిన్న భిన్న క్రమము లతో నున్నది. డా. ఒట్టో స్క్రాడరు మహాశయుడు పాంచరాత్రోపోద్ఘాతమను ఆంగ్లవ్యాసమున ఈ ఆగమములను గూర్చి విపులముగ చర్చించి యున్నాడు. డా. ఆర్. జి. భండార్కరు ప్రముఖులు ఆధునిక విమర్శసాధనములను గొని వీని కాల నిర్ణయాదులను గూర్చి చర్చించియున్నారు.
ఈ సంహితలయందును జ్ఞాన- క్రియా- యోగ -చర్యాపాదములు అను విభాగము లున్నవి. ముద్రా విశేషములు, యంత్ర తంత్ర విశేషములు, జపహోమాది ప్రక్రియలు, దీక్షావిధి మొదలగు విషయములు విశిష్టక్రమమున నభివర్ణింపబడి యున్నవి.
శాక్తేయాగమములు :. శాక్తేయాగమము లకు "తంత్రము" లను వ్యవహారము ప్రసిద్ధమై యున్నది. తంత్రమనగా - దేవతల యనుగ్రహమును సంపాదించుటకై ఫలార్థియగు పురుషుడుచేయు ప్రయత్నము. మంత్ర దేవతోపాసనాదులకు "తంత్ర” మను వ్యవహారము రూఢి అయినది.
ఈ తంత్రములయందు మంత్ర యంత్ర దేవతోపాసనాదులు ముఖ్యముగ నిరూపింపబడి యున్నవి.
శాక్తుల సంప్రదాయము :- సనాతనుడగు శివుడు నిర్గుణుడు, సగుణుడునుగా నున్నాడు. నిర్గుణు డనగా ప్రకృతి కంటెను పరుడు. అనగా ప్రకృతి సంబంధములేనివాడు. సగుణుడనగా ప్రకృతి సంబంధముగలవాడు. ప్రకృతికే కళయని నామాంతరము, నకళుడై సచ్చిదానంద స్వరూపుడగు పరమేశ్వరునివలన శక్తియు, అందుండి నాదము, దానినుండి బిందువు కలుగుచున్నవి. పరమశక్తిమయ మనునది బిందువు, నాదము, బీజము అని మూడువిధము లగుచున్నది. అందు బిందువు శివాత్మకము, బీజము శక్త్యాత్మకము, నాదము రెండింటి సమవాయము. అటుపిమ్మట బిందువునుండి రౌద్రియు, నాదమునుండి జ్యేష్ఠయు, బీజమునుండి వామయు నను శక్తులు గలుగుచున్నవి. వానినుండి క్రమముగ రుద్ర - బ్రహ్మ - రమా ధిపులు గలుగుచున్నారు. వారలు ఇచ్ఛాశక్తి, క్రియా శక్తి, జ్ఞానశక్తి స్వరూపు లగుదురు. వీరలే వహ్ని- ఇందు.. అర్క స్వరూపులు, శక్త్యవస్థారూపమగు ప్రథమబిందువు నుండి అఖండమైన నాదము జనించుచున్నది. దీనినే శబ్ద బ్రహ్మమని యందురు. సర్వభూతముల యొక్క చైతన్యమే శబ్ద బ్రహ్మము. ఇదియే దేహమధ్యగతమగు కుండలినీ రూపమునొంది గద్యపద్యాది రూపమగు వర్ణాత్మకముగ నావిర్భవించుచున్నది. బింద్వాత్మకుడును, కాలబంధువును,