Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/721

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రీతిహాస పరిశోధక మండలి

దీనినిబట్టి పారిశ్రామికాభివృద్ధి కొరతపడ్డ రాష్ట్రాలలో దిగుమతులు ఎక్కువగా ఉండును. ఒక్క మదరాసు రాష్ట్రము నుండియే ఆంధ్రరాష్ట్రము సాలీనా పదికోట్ల రూపాయల వస్తువులను అదనముగా దిగుమతి చేసికొను చున్నది.

విదేశ వ్యాపారము : ఆంధ్ర రాష్ట్రము యొక్క విదేశ వ్యాపారము ముఖ్యముగా విశాఖపట్టణము, కాకినాడ, మదరాసు రేవులద్వారా జరుగుచున్నది.

విశాఖపట్టణము  :- ఇక్కడినుండి 20 కోట్ల రూపాయిల సరుకు ఎగుమతి అగుచున్నది. మాంగనీసు, పొగాకు మిరపకాయలు, వేరుసెనగనూనె, ఇనుమురాయి, బెల్లము, తోళ్ళు, కాయలు, ఆముదము, స్పిరిటు, సిమెంటు రాయి, కొమ్ములు, ఎముకలు, పసుపు, డివిడివి చెక్క, తివాచీలు, గ్రాఫైట్ మొదలైనవి ఉన్నవి.

కాకినాడ  :- ఇక్కడినుండి మూడుకోట్ల రూపాయల విలువగల వస్తువుల ఎగుమతి ఉన్నది. పొగాకు, జీడిపప్పు, తాటినార, నూనెలు, తోళ్ళు, తోళ్ళు శుభ్రపర చెడు దినుసులు, ప్రత్తి, పసుపు మొదలైనవి ఇందు కలవు.

మదరాసు :- ఈ రేపుగుండ మొత్తము 56 కోట్ల రూపాయల విలువగల వస్తువులు ఎగుమతులుగా వెళ్ళు చున్నవి. అందులో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వస్తువుల విలువలు : మైకా రు. 183 లక్షలు ; నూనెలు, గింజలు రు.598 లక్షలు ; పొగాకు రు. 3388 లక్షలు, మాంగనీసు రాయి రూ.51లక్షలు ; చందనము, నూనె రూ. 33 లక్షలు; ఇనువరాయి రూ. 20 లక్షలు; కై నైట్, స్టియటైట్ రూ. 6 లక్షలు. మొత్తము 12కోట్ల 29లక్షల రూపాయల వస్తుసామగ్రి ఎగుమతియగుచున్నది. ఆంధ్ర దేశము మొత్తము ఎగుమతులు 40 కోట్ల రూపాయలని అంచనా వేయబడినది. ఎగుమతులు ఎక్కువ భాగము యునైటెడ్ కింగ్ డం, అమెరికా, జపాను, జర్మనీ, కెనడా మొదలైన దేశాలకు వెళ్ళుచున్నవి.

దిగుమతులు  : వక్కలు, క్రొవ్వువత్తులు, బొగ్గు, సైకిళ్ళు, ఖర్జూరము, మందులు, విద్యుచ్ఛక్తి సామాను, ఇనుప సామాను, నూనె, పెట్రోలు, మోటారు నూనెలు, యంత్ర సామగ్రి, లోహాలు, మోటార్లు, రాసాయనికపు నూనెలు, రంగులు, వార్నీషు, గుడ్డలు, నూలు మొదలైనవి ఎన్నో ఉన్నవి. విశాఖపట్టణము, కాకినాడ రేవులలో దిగుమతి అగుచున్నవి. విశాఖపట్టణములో ముఖ్యముగా యంత్రసామగ్రి, తిండిగింజలు దిగుమతి అగుచున్నవి. కాకినాడలో తిండిగింజలే ముఖ్యమైన దిగుమతి. మిగతావి మదరాసు రేవునకే వచ్చుచున్నవి. రేవు పట్టణాల అభివృద్ధికి కూడ ఆంధ్రరాష్ట్రము ఎంతో పాటుపడవలసి యున్నది.

ఆంధ్రరాష్ట్రపు వ్యాపారము ఈ క్రింది విధముగా జరుగుచున్నది.

ఎగుమతులు లక్షల రూ. దిగుమతులు లక్షల రూ.
రైలుమార్గం గుండా 27.59 27.52
మదరాసు రేవు 22.00
ఆంధ్ర రేవులు 18.00 35.00
మెత్తము. 67.59 62.52

పై పట్టిక ననుసరించి ఆంధ్ర రాష్ట్రము 5,07 లక్షల రూపాయీలు అదనముగా వ్యాపారములు కలిగిఉన్నను మదరాసు రాష్ట్రపు వ్యాపారము కూడ లెక్క చూచి కొనిన మొత్తము మీద 10 కోట్ల రూపాయలు తరుగు ఉండునని అంచనా వేయవచ్చును, ఆంధ్రరాష్ట్రములో కొన్ని పరిశ్రమలను స్థాపించిననే తప్ప ఈ పరిస్థితి చక్కబడుటకు అవకాళము లేదు.

డి. వి. కె.

ఆంధ్రీతిహాస పరిశోధక మండలి  :- "ఆంద్రేతిహాస పరిశోధక మండలి" అనునది రాజమహేంద్రవరములో స్థాపితమయిన చరిత్ర పరిశోధక సంస్థ. ఆంధ్రదేశములో చరిత్ర విజ్ఞానాభివృద్ధికి, ముఖ్యముగా ఆంధ్ర చరిత్ర సమాలోకనమునకు కృషిసల్పు సంస్థలు లేకుండెను. అందుచే, కీర్తి శేషులు చరిత్ర చతురానన చిలుకూరి వీరభద్రరావు, డాక్టర్ చిలుకూరి నారాయణరావు, శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ, శ్రీ భావరాజు వేంకట కృష్ణారావుగార్లు సమాలోచనముచేసి "ఆంద్రేతిహాస పరిశోధకమండలి" సంస్థాపనమునకు ఉద్యమించిరి. ఏతదుద్యమ ఫలితముగా ఈ సంస్థ రాజమహేంద్రవరములో