ఆంధ్రులు - వాణిజ్యము
తాళ్ళరేవు : నౌకల మరమ్మతు కొంతకాలము జరిగిన తరువాత 1802లొ ఇచెంజర్ రోబన్ అను ఇంగ్లీషు
వర్తకుడు ఇక్కడ డ్రైడాక్ నిర్మించినాడు. ఆల్బాట్రాప్ అను నౌకను ఇక్కడ బాగుచేసినారు.
ఇంజరం :- ఇది కాకినాడకు 15 మైళ్ళ దూరములో ఉన్నది. 1708 లో తూర్పు ఇండియా సంఘమువారు ఫ్యాక్టరీని నిర్మించినారు. 1722 లో ఈ ఫ్యాక్టరీలో ఇండియాలోకెల్ల శ్రేష్ఠమైన లాంగ్ క్లాత్ ఉత్పత్తి అయ్యెడిదని కెప్టెన్ హామిల్టన్ వ్రాసినాడు.
యానాం :- ఇక్కడ ఫ్రెంచివారు 1750 లో ఫ్యాక్టరీని నిర్మించిరి.
నీలపల్లి :- ఫ్రెంచివారు 1751 లో బట్టల మిల్లు స్థాపించినారు. 1854 లో ఫ్రెంచి ఇంజనీరు బియ్యపు మిల్లు పెట్టినాడు. నీలిమందు ఫ్యాక్టరీగా ఇది కొన్నాళ్ళు పనిచేసినది.
మాధవాయపాలెం :- 1628 లో నరసాపురములో డచ్చివారు ఇనుపకార్ఖానా పెట్టుకొన్నారు. ఇక్కడ 1677 లో ఫ్యాక్టరీని నిర్మించినారు. పెద్ద పెద్ద ఓడలు ఇక్కడ మరమ్మతు అగుచుండెడివి.
బందరు :- 1611 లో తూర్పు ఇండియా సంఘము వారు ఫ్యాక్టరీని నిర్మించినారు. ఇక్కడినుండి మస్లినులు ఎగుమతి అగుచుండెడివి. 1614 లో డచ్చివారును, 1669 లో ఫ్రెంచివారును వ్యాపారమును ప్రారంభించినారు.
కృష్ణాపట్నం :- 13 వ శతాబ్దము నాటినుండి "కొల్లి త్తురై " అను పేరుతో ఇక్కడ గొప్ప రేవుపట్టణము ఉండెడిది. 18 విదేశాలనుండి వచ్చిన 500 మంది వర్తకులు ఇక్కడ చేరినారని ఒక శాసనము చెప్పుచున్నది.
ఆంధ్రరాష్ట్రము - వాణిజ్యము : ఆంధ్ర రాష్ట్రము ప్రధానముగా వ్యావసాయిక దేశము. అందువలన వ్యవ సాయమువలన వచ్చు పంటల వివరాలనుబట్టి వ్యవసాయ ఉత్పత్తిని గ్రహించవచ్చును. మొత్తముమీద 250 కోట్ల రూపాయల పంట పండుచున్నది.
పంట | విస్తీర్ణము, వేల ఎకరములు | ఉత్పత్తి, లక్షల టన్నులు | మొత్తపు పంట విలువ, లక్షల రూపాయలు |
---|---|---|---|
ధాన్యము | 42,84.00 | 28.00 | 61,84 |
గోధుమ | -- | 0.01 | 5 |
చోళ్ళు | 25,76.00 | 5.20 | 11,37 |
సజ్జలు | 8,94.00 | 2.00 | 4,45 |
జొన్న | 5,27.00 | 0.10 | 29 |
రాగి | 5,93.00 | 2.30 | 4,83 |
కొట్టి | 1,23.00 | 1.30 | 2,46 |
వరిగలు | 2,63.00 | 0.50 | 80 |
ఇతరములు | 5,50.00 | 0.90 | 1,70 |
సెనగలు | 1,05.00 | 0.20 | 74 |
పెసలు | 3,56.00 | 0.30 | 1,79 |
కందులు | 1,85.00 | 0.20 | 86 |
మినుములు | 1,50.00 | 0.20 | 93 |
ఉలవలు | 8,27.00 | 0.66 | 2,47 |
ఇతరములు | 56.00 | 0.03 | 14 |
వేరుసెనగలు | 22,85.00 | 8.60 | 50,38 |
కొబ్బరికాయలు | 83.00 | -- | 3,22 |