ఆంధ్ర సినిమా పరిశ్రమ
మిచ్చెడు గృహలక్ష్మి యను సాంఘిక చిత్రమును, మొదటి జానపద చిత్రమగు గులేబకావలియు నిర్మితములయినవి.
వ్యావహారిక భాషను పురాణచిత్రములో ఉపయోగించి సి. పుల్లయ్యగారు "మోహినీభస్మాసుర "అను చిత్రమును సిద్ధపరచారు.
శారదా రాయలసీమ స్టూడియో నిర్మాణము జరిగి, పురిటిలోనే సంధిగొట్టిపోయినది. 1-8-1939 నుండి సినిమా టికట్లపై ప్రభుత్వము వినోదపు పన్ను విధించినది. సాంఘిక చిత్రాలు ఎక్కువగా వచ్చినవి. తారల గిరాకీ కారణముగా చిత్ర నిర్మాణ వ్యయము లక్ష రూపాయల వరకు పెరిగినది. 1939 లో పెట్టుబడి చాలినంత లేని సంస్థలు ఏర్పడి పెక్కు అగచాట్లపాలయినవి. కొన్ని సంస్థలు కాలగర్భములో లీనమైపోయినవి. సినిమా ఒక వ్యాపారము కాదు. అందులో మోస మెక్కువకలదు అనెడు భావము ప్రజలలో ప్రబలినది. దానితో పెట్టుబడి దారులు వెనుకకు తగ్గినారు.
1940 లో "చారిష్టరు పార్వతీశం" అను ప్రఖ్యాత నవలను అనుసరించి, సంపూర్ణ హాస్యచిత్ర నిర్మాణము జరిగినది. "చండిక", "కాలచక్రము" అను చారిత్రక చిత్రాలు వెలువడినవి.
యుద్ధము సినిమా పరిశ్రమపై దెబ్బతీయసాగినది. ముడిఫిల్ము కొరత ఏర్పడినది. యుద్ధనిధులకయి చిత్రాలు ఆడవలసి వచ్చినది. యుద్ధప్రచార చిత్రములను తీయుడని ప్రభుత్వము నిర్మాతలను కోరినది. కర్మశాలా చట్టము సినిమాలకు వర్తింపచేయబడినది. ఆపరేటర్లకు అనుమతి పత్రము (లైసెన్సు) ఉండవలెనని అది పరీక్షించి యివ్వబడునని ప్రభుత్వము శాసించినది.
చిత్రాలకుగూడ లాభాలు సరిగా రాలేదు. ప్లేబాకు పద్ధతి వచ్చినది. ఇది చిత్రమునకు ఎంతో మేలు చేసినది. ఇంతవరకు పాటను చిత్రీకరించుటగూడ మాటలను శబ్ద గ్రహణము చేసినట్టు చేసెడివారు. సెట్టుమీదనే వాద్యగోష్ఠికూడ ఉండెడిది. అయితే వాద్యగోష్ఠికి ఒక మైకు, నటునకు మరొక మైకు పెట్టి శబ్దగ్రాహకుడు సంయోగ పరచెడువాడు. అయితే, పరుగెత్తుచు, పాడుటకు వీలుండెడిదికాదు. అంతేగాక, నటులే పాడవలసివచ్చు చుండెను. అందరు నటులును పాడగలవారుగా నుండరు కదా! ఉన్నను సంగీతముమీద దృష్టి యుంచినపుడు నటనకు, నటనమీద దృష్టి యుంచినపుడు పాటకు లోపము జరుగుచుండెడిది. ఈ యిబ్బందులన్నియు ఈ 1940 నుండి తీరిపోయినవి.
ఈ కాలము నాటికి తెలుగులో సినిమా పత్రికయే లేదు. శ్రీ ఇంటూరి వేంకటేశ్వరరావు "చిత్రకళ” అను పేరుతో ఒక మాస పత్రికను ఆరంభించెను. అదే మన తెలుగు సినిమా పత్రికలలో మొదటిది.
1941–1942: 1941 లో వెలువడిన చిత్రములలో "మహాత్మాగాంధీ" అనునది మొదటి డాక్యుమెంటరీ చిత్రము. ఈ సంవత్సరమున చిత్రపరిశ్రమ యుద్ధము వలన పెద్ద దెబ్బ తిన్నది. పెట్రోలు దొరకుట కష్టమైనది. ముడి ఫిలుము లభించుట కూడ కష్టమయ్యెను. సినిమా పరికరముల విషయములో ప్రభుత్వము ఎక్కువ ఆంక్షలు పెట్టినది. ప్రతి వస్తువు యొక్క ధర పెరిగి పోయినది. బర్మా, మలయా రాష్ట్రములను జపాను పట్టుకొనుటచే, అక్కడికి మన చిత్రాలను పంప వీలు కాకుండ నైనది. కుల మత కలహాల వలన సినిమా చూచెడు ప్రేక్షకుల సంఖ్య సన్నగిల్లిపోయినది. వరదలు, గాలివానలు ఎక్కువైనవి.
ముడి ఫిల్ములకు కోటా సిస్టము వచ్చినది. అంతకు ముందు సంవత్సరాలలో చిత్రాలు తీయుచున్న వారికే చిత్ర నిర్మాణమునకు ప్రభుత్వమునుండి అనుమతి లభించుచుండెను. అందువలన క్రొత్తవారు పరిశ్రమలోనికి రాలేక పోయినారు.
ఏ పౌరాణిక కథనో తీసి నాలుగుపైనలు సంపాదించు కొనవలయుననెడు మనస్తత్వము నిర్మాతలకు ఏర్పడినది. అందువలన మరల ఈ రెండు సంవత్సరాలును పురాణ చిత్రాల యుగమయిపోయినది. అయితే, యుద్ధమువలన ప్రజల చేతులలో నాలుగు పైసలు ఉండుటచేత సంవత్సరాంతమునకు సినిమా ప్రేక్షకలోకము ఎక్కువైనది.
నిజముగా చారిత్రక చిత్రమనునది 1942 లో వచ్చినది. అదియే “పత్ని”. మొదటిసారిగా కవిజీవితమును ప్రతిపాదించు "పోతన" కూడ ఈ సంవత్సరమే వచ్చినది. చిత్రమ నిడివి 11 వేలకు మించియుండరాదని మరల మరి యొక ఆంక్ష వచ్చినది. దానితోపాటు ట్రైలర్లు గాని, ప్రచార