Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాజ్మయ చరిత్రము-II


ఈ కాలమున వ్రాయబడిన చారిత్రక వచన కావ్యములలో రాయ వాచకమును మొదట పేర్కొనవలయును. ఇ౦దు కృష్ణదేవరాయల చరిత్రము వాడుక భాషలో చెప్పబడినది. ఇది విశ్వనాథ నాయకునకు అజ్ఞాతనాముడైన అతని స్థానాపతి వ్రాసిన విన్నపమని అందు గలదు. తాను సుజనులచే విన్న సూనృత వాక్కులను రచించితినని గ్రంథకర్త చెప్పి యున్నాడు. ఇందు మొదట పేర్కొనబడిన విశ్వనాథ నాయకుడు మథుర రాజ్యస్థాపకుడైన విశ్వనాథ నాయకుడు కాడనియు, క్రీ. శ. 1595 నుండి 1601 వరకు పాలించిన రెండవ కృష్ణప్ప తమ్ముడనియు శ్రీ డా. నేలటూరి వేంకటరమణయ్యగా రభిప్రాయ పడుచున్నారు. కృష్ణరాయల కాలమున అధికార వర్గము నందు వాడుకలో నుండిన భాషయే ఈ గ్రంథమున ఉపయోగింపబడినది. ఫార్శీ భాషయందలి రాజకీయ పారిభాషిక పదములు పెక్కందు ప్రవేశించి యున్నవి. వాక్యములు అతి దీర్ఘములుగా నుండుట చేతను, వాక్య యోజన ప్రాతపద్ధతిని సాగుటచేతను అచ్చటచ్చట కొంత అర్థక్లేశము కల్గుమాట సత్యమే. ఐవను మొత్తముమీద ఇందలి భాషవ్యర్థపదములు కాని, అనవసరాడంబరముగాని లేక సరళమై మిక్కిలి శక్తిమంతముగా నున్నది.

రాయవాచకమువంటి చారిత్రక వచన గ్రంథమే మరొకటి కలదు. దాని నాంధ్ర సాహిత్య పరిషత్తువారు ప్రకటించి యున్నారు. ఇందలి భాషయు రాయవాచక మందలి భాషయు నొకే విధమున నున్నవి. కాని ఇందలి చారిత్రకాంశముల యాథార్థ్యము సందేహాస్పదముగా నున్నది. ఇది యత్కర్తృక మో తెలియదు.

చొక్కనాథుని భార్యయైన రాణి రంగమ్మ మనుమడగు విజయరంగ చొక్కనాథుని పక్షమున మథుర రాజ్యమును క్రీ. శ. 1689 నుండి 1706 వరకును పాలించి యుండెను. ఆమెను గర్శించుచు, ఆమె మన్మథ క్రీడలను వర్ణించుచు. అశ్లీల పదములతో కూడిన యొక వచన గ్రంథము కానబడుచున్నది. దాని పేరు మధుర మంగా పుంశ్చలీ విలాసము. దీనిని రచించిన వారెవ్వరో తెలియదు. ఆత డేకారణముననో రాణి కోపమునకు గురియై అందందు తిరుగుచు కసితీర్చుకొనుటకై బూతుల బుంగయైన ఈ గ్రంథమును రచించినట్లు తోచుచున్నది. అప్పటి దేశపరిస్థితులు కొన్ని ఇందు వర్ణితము లగుటచే ఇది చరిత్రకారులకు మిక్కిలి ఉపయోగకరముగా నుండును.ఇంటలి భాష రాయవాచకము నందలి భాషనే పోలి యున్నది. ఇందు అందందు కొన్ని ద్విపద పంక్తులు గలవు.

రాయవాచకము వంటిదే తంజాపురాంధ్ర రాజుల చరిత్ర అను వచనగ్రంథ మింకొకటి కలదు. దీని కర్త కూడ అజ్ఞాతుడే. తంజావూరు రాజ్యము నాక్రమించి ఏలుటకు మధుర నాయకులకు హక్కు కలదని నిరూపింప యత్నించుటచే అతడు మధుర నాయకుల కాశ్రితుడై యుండునని తోచుచున్నది. తనపై తిరుగబడిన నాగమనాయని తండ్రియని చూడక బంధించి తెచ్చిన విశ్వనాథ నాయకునికి రాయలు చోళపాండ్య రాజ్యములు పంచి యిచ్చెననియు, తరువాత అచ్యుతరాయలు తన మరదలైన మూర్తమాంబను చెప్పప్పకిచ్చి పెండ్లిచేసి విశ్వనాథ నాయకుని ఏల్బడినుండి చోళ రాజ్యమును గ్రహించి ఆమెకు అరణముగా నిచ్చెననియు పై గ్రంథమున వ్రాయబడి యున్నది. ఇందు చెంగమలదాసు మనుమడు విజయ మన్నారప్పనాయడు తన చెల్లెలిని విజయరంగ చొక్కనాథుని (క్రీ. శ. 1706-1732) కిచ్చి పెండ్లి చేసిన వృత్తాంతము వ్రాయబడి యుండుటచే ఈ గ్రంథము క్రీ.శ.18 వ శతాబ్ది మధ్య భాగమున రచింపబడినట్లు గోచరించుచున్నది. ఇందలి రచనా విధానము, చిన్న చిన్న వాక్యముల కూర్పు, స్పష్టమైన భాష, ఇది రాయవాచకము కంటే అర్వాచీనమని చెప్పక చెప్పుచున్నవి. ఇందు అన్యభాషా పదము లంతగా కానరావు, భాష చాలవరకు దోషరహితమై ఉన్నది.

తుపాకుల కృష్ణప్ప నాయకుని కుమారుడును, మధుర రాజుల యొద్ద దళవాయిగా ఉండినవాడును అగు అనంత భూపాలుడు పెక్కు వచన గ్రంథములు రచించెను. (క్రీ. శ. 17 వ శతాబ్ది ఉత్తరార్ధము) ఇతడు భారత వచన రచనమున కళువె వీరరాజునకు కొంత తోడ్పడి యుండెను. ఇతడు విష్ణుపురాణము, మహాభారతాను శాసనిక పద్వము, రామాయణ సుందరకాండము, భగవద్గీత అను వచన గ్రంథములు విరచించెను. ఇందు విష్ణుపురాణ మొక్క టే ముద్రితమైనది. ఆనంతభూపాలుడు