Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంటువ్యాధులు. ఎల్లోపాతి 8. స్వాదుపిండము(పాంక్రియాస్) వాయుట, 4. మెదడు వావు. వ్యాధి లక్షణానుసారముగా చికిత్స చేయవలేను. గ్లాండులరు జ్వరము :- ఇది పిల్లలలోను పెద్దల లోను ఒక రకపు రసివలన వ్యాపించు వ్యాధి. అంకు రించు కాలము 5 దినములు మొదలు 10 దినముల వరకు ఉండును. ఈ క్రింది రకములుగా ఈ జ్వరము వ్యాప్తిలో మున్నది. 1. మెడలగ్రంధులు వాచి, పెద్దవై, జ్వరము వచ్చుట, 3. గొంతు నొప్పి యుండుట. రక్తములో తెల్ల కణములు హెచ్చుగా నుండును. సహజముగ 4 శాతము నకు బదులు మానొసైటులు 60-75 శాతము ఉందును. వ్యాధి లక్షణానుసారముగ చికిత్స చేయవలెను. స్కార్లెటు జ్వరము :- ఇది ఇంగ్లండు మొదలగు శీతల దేశములలో మాత్రమే వచ్చును. ఇది సంపర్క దోషమువలన సంచలిం చెడు జ్వరము. స్ట్రెపోకాకస్ హిమ విటికస్ అను ప్రత్యేక క్రిముల వలన కలుగును. గొంతు కంఠయు మంటతో వాచుట, చర్మముమీద పొక్కులు లేచుట ఉండును. నాలుక యొక్క కొనలు ఎఱ్ఱబడి మధ్య భాగము తెలు పెక్కును. జ్వరముండును. విషజన్య రక్త దోషము కలిగినచో వ్యాధి తీవ్రరూపములు ధరించును. రోగిని తక్కినవారి నుండి వేరుచేయుట, స్ట్రెప్టో కోకల్ ద్రవమును సూదిమందుద్వారా ఇచ్చుట, పెన్సిలిన్ మొద లగు సూదిమందు లిచ్చుట- ఇందులకు జరుగవలసిన చికిత్సలు. విషసర్పి రోగము ( ఎతిసెవెలస్) :- తీవ్రమగు ఈ అంటురోగము హిమొలైటిక్ స్ట్రెప్టోకోకస్ స్థానిక సంపర్క దోషము వలన సంభవించును. జ్వరము, చర్మము మీద ఎఱ్ఱటి వాపు ఉండును. ఇది సాధారణముగా ముఖముమీద, పిల్లలకు నాభిస్థానము ప్రక్కన కలుగును. పెన్సిలిన్ ఇచ్చుట ఇందుకు తగిన చికిత్స. దొమ్మరోగములు (ఆంత్రాక్సు ) :- జంతువులకును, లేక వాటి చర్మములకును, రోమములకును సమీపమున నుండు వారికి సంపర్క దోషముచే క్రిములవలన వచ్చు వ్యాధి. రోగపీడితమైన జంతువుల రోమములచే చేయ బడిన కుంచెలను క్షురకర్మకు ఉపయోగించి దీనికి గురి యగుదురు. అంకురించుకాలము 24 మొదలు 72 గంటల వరకుండును. చర్మముమీద ఒక పొక్కు లేచి 20 అందు చీము కలిగి దాని చుట్టును ఉబ్బును. జ్వరము వచ్చును. ఒకప్పుడు ఊపిరితిత్తులుకూడ దీనికి గురికావ చ్చును. పెన్సిలిన్ మరియు ఆంత్రాక్సు సీరం ఇచ్చుట ఇందులకు సరియగు చికిత్స. అంటు పెంచారోగము ( గ్లాండర్సు):- ఇది ఒక ( రోగము. ముక్కునుండి కారుట, ఒకప్పుడు చర్మము పై పొక్కులు లేచుట, ఎముకలందు, కీళ్లయందు నొప్పులు ఉండును. జబ్బుగల గుఱ్ఱములను కాచువారికి సూర్మ క్రిములు లోన ప్రవేశించుట వలన కలుగును. ఇది చాల ప్రమాదకరమయిన రోగము. టులరీమియా :- గుఱ్ఱపు ఈగ కాటువలన కలుగు ఈ రోగము క్రిములచే అంకురించును. అమెరికా సంయుక్త రాష్ట్రములు, రష్యా, జపాన్ దేశములలో ఈ వ్యాధి విస్తారముగా కన్పడును. మెడ క్రింది మాంస గ్రంధులు పెరుగుట, టైఫాయిడ్ను పోలిన జ్వరము వచ్చుట దీని లక్షణములు. ఒక రకపు ఆంటీసీ రము మరియు స్ట్రెప్టోమైసిన్ ఈ రోగమును అరికట్టుటలో . ఈ మంచి ప్రయోజనకారులుగ నున్నవి. సిటాకోసిస్ :- ఇది రామచిలుకలకు ఒక రసి వలన ఆ వచ్చు వ్యాధి. ఈ వ్యాధిగల పతులు విసర్జించిన పదా ర్ధపు గాలిని పీల్చుట వలన ఆ వ్యాధితో సంపర్క దోషము సంపర్కదోషము వాటిల్లును. అంకురించు కాలము 7 మొదలు 12 దిన ముల వరకు ఉండును. పిమ్మట రోగికి టైఫాయిడ్ను పోలిన ఒక రకపు జ్వరము వచ్చును. ఊపిరి తిత్తులకు వ్యాధి సోకిన చిహ్నములు కానవచ్చును. దీనినుండి కోలు కొనుటకు రెండు మూడు వారములు పట్టును. ఇందు వలన సంభవించు మరణము ల శాతము 16-85 వరకు ఉండును. రోగ లక్షణానుసారముగా చికిత్సచేయ వలెను. బోరాంవ్యాధి :- ఛాతి లో తీవ్రమగు నొప్పి, జ్వరము ఉండును. ఇందులకు గురియైన కండరములను నొక్కినచో నొప్పి కలుగును. ఈ వ్యాధి రెండు మూడు దినములలో తగ్గిపోవును. వ్యాధి లక్షణానుసారముగా చికిత్స చేయవలెను. రొంప (Common Cold) :- ఇది సాధారణముగ వచ్చు వ్యాధి. ఇది రసి వలన వచ్చును. జనసమ్మ