ఆంధ్రదేశ చరిత్రము - I
చును. పలపదములు సాధారణముగా ఆరుమాత్రల ఆవృత్తులతో నడచునట్టివి. కొన్ని మేలుకొలుపులు, గుమ్మడు పాట (ముత్యాలసరములు), ఏడుమాత్రల ఆవృత్తులతో(మిశ్రగతి) నడచునట్టివి. బాలక్రీడలు, రామదాసు కీర్తనలు కొన్ని ఎనిమిది మాత్రల ఆవృత్తులతో నడచినట్టి పాటలు, కనుక ఈ చిన్న సూత్రముతో వివిధ జానపద గేయముల రీతులను సులభముగా బంధింపవచ్చును.
ఉపసంహారము : మన జానపద వాఙ్మయ సంపద ఇప్పటికే చాలభాగము లుప్తమై పోయినది. ఉన్నదానినైన భద్రపరచుకోనుట మన కర్తవ్యము. జానపద కవితారీతులను అందరికన్న రాజకీయపథముల వారు ఎక్కుడుగా వాడు కొనుచున్నారు. వీరి ఆశయము కొనియాడ తగినదే. స్వరాజ్యోద్యమమునందును, సంస్కరణోద్యమము నందును వెలువడిన గేయములు అనేకములు ప్రజల సొమ్మైపోయినవి. తాత్కాలిక ప్రయోజన మాశింపబడినను వీటి ప్రభావము మాత్రము అనంతముగా పడినదని చెప్పుకొనక తప్పదు. పండితులు విమర్శకులు జానపద గేయములందున్న సాహితీ విషయములెత్తి చూపవచ్చును. సామాజిక శాస్త్రవేత్తలు ఆ సంపదలో తమకు కావలసిన అమూల్య మణులను పొంద వచ్చును. సిద్ధహస్తులైన రచయితలు వాటియందలి వస్తువు గ్రహించి కల మందు కొన్నచో రవ్వలు రాల్చ వచ్చును. జానపద వాఙ్మయమున నుండు జాతీయములు, నానుడులు, వింతవింత పలుకుబడులు, శిష్టులు గ్రహింపవలసిన అమూల్యసంపదలు నవ్యభారత పునర్నిర్మాణమున వివిధప్రణాళికా ప్రచారమునకును, ప్రజాప్రబోధము నకును జానపద కవితారీతులు. అత్యంతము ఉపకరించునట్టివి. పాశ్చాత్యులును, ఔత్తరాహులును ఈ మార్గమున ఎంతోదూరము సాగిపోయినారు. జానపద వాఙ్మయమున తెలుగువారు అభినివేశము కలిగించుకొన్నచో ఆంధ్ర దేశమునకును, ఆంధ్ర భాషామ తల్లికిని, ఆంధ్రవిజ్ఞానమునకును ఇతోధికమగు వికాసము కలుగగలదు.
బి. రా.
ఆంధ్రదేశ చరిత్రము 1 క్రీ. శ. 625 వరకు :- ఆంధ్రదేశము నిర్ణయము : భరతఖండములోని దక్షిణాపథ దేశములలో ఆంధ్రదేశము సుప్రసిద్ధమైనది. ఇది 14° 29° మధ్య ఉత్తర అక్షాంశము, 20° ఉత్తర అక్షాంశముల మద్య భాగమునను 78° - 85° తూర్పు రేఖాంశముల మధ్యభాగమునను ఉన్నది. ఆంధ్ర దేశమునకు ఉత్తరమున ఉత్కళ మహారాష్ట్రదేశములు, తూర్పున బంగాళాఖాతము, దక్షిణమున ద్రావిడ కర్ణాటక దేశములు, పశ్చిమమున నూతన బొంబాయి రాష్ట్రము ఎల్లలుగానున్నవి. ఈ దేశవిస్తీర్ణము 1,10,280 చదరపు మైళ్లు. ఈ దేశమునకు 540 మైళ్ళు తీరభూమి కలదు. ఇందు 20 జిల్లాలు కలవు. హైద్రాబాదు ఆంధ్రప్రదేశపు రాజధాని, దీనిలో ఆంధ్రరాష్ట్ర ప్రాంతము, పూర్వపు హైదరాబాదు రాష్ట్రమునందలి తెలంగాణము చేరియున్నవి. ఇందలి జనసంఖ్య 322 లక్షలు.
ఆంధ్రులు - పూర్వ చరిత్ర : ఆంధ్రులు చాల ప్రాచీన జాతివారు. ఐతరేయ బ్రాహ్మణములో శునశ్శేపుని కధ యందు వీరు పేర్కొనబడియున్నారు. ఆ బ్రాహ్మణము క్రీ. పూ. 1000 - 800 కాలము నాటిది. ఇచ్చట వీరు పుండ్ర, పుళింద, మూతిబ, శబర జాతులతో కలిపి చెప్పబడియున్నారు. ఈ జాతులవారు వింధ్యపర్వత ప్రాంత వాసులు, రామాయణ మహాభారతములలో ఆంధ్రులు చోళ, చేర, పాండ్యులతో కలిపి పేర్కొనబడిరి. భారత దేశమందలి రాజ్యములను వర్ణించు సందర్భమున పురాణములును, బౌద్ధ గ్రంథములును ఆంధ్రుల ప్రశంస చేయుచున్నవి. అగస్త్యుడను మహర్షి ఉత్తరమునుండి దక్షిణా పథమునకు వచ్చిన ఆర్యుడని, అతడు తన భార్యయగు లోపాముద్రతో తీర్థయాత్రలకొరకు బయలుదేరి వింధ్య పర్వతములను దాటి ఆర్యులకు త్రోవచూపెనని ఒక కథ యున్నది.
ఆంధ్రశబ్ద వ్యుత్పత్తిని గూర్చి అనేక అభిప్రాయములు కలవు. విశ్వామిత్ర మహర్షి యొక్క నూరుగురు కుమారులలో జ్యేష్ఠులగు సగము మంది తమ తండ్రి ఆజ్ఞ ప్రకారము శునశ్శేఫుడను వానిని అన్నగా అంగీకరింప లేదనియు, అందులకై ఆత డలిగి వారిని “మీరు ప్రజా భక్షకులు కండు" అని శపించె ననియు వారే ఆంధ్రులకు మూలపురుషు లైనట్లును ఐతిహ్యము కలదు.
ఐతరేయ బ్రాహ్మణమున 'అంధ్ర' అను పదము నీచ జాతి పరముగా ప్రయుక్తమైన దనియు, 'ఆంధ్ర' అను