అవనీంద్రనాథఠాకురు
ఉత్సాహాతిరేకమునకు ప్రాణము పోసెను. ఇప్పటివరకు వంగ దేశీయులు పాశ్చాత్య సంస్కృతి అను మద్యమును
విశేషముగా క్రోలియున్నారు. పైతరగతికి చెందిన వంగ దేశీయుల ఆలోచనా విధానము, వారిభాష - సర్వము ఆంగ్లేయ సంప్రదాయాను కారి అయ్యెను. దీనికి అనివార్య మయిన ప్రతిక్రియ ఈ శతాబ్ది ఆదియందు పొడచూపెను. సాహిత్యము నందువలెనే కళలయందును మనజాతికి స్వతస్సిద్ధమైన ధర్మములకు అనుకూలముగ మనఃప్రవృత్తిని ఆవిష్కరించుట ఉత్తమకృత్య మని తొలుదొల్త నిరూపించినవాడు అవనీంద్రనాథ ఠాకురే. పాశ్చాత్య సంస్కృతికి విలక్షణ ఫలమయిన పాశ్చాత్యకళ పాశ్చాత్యులకు హితకర మగును. టక్సెడో (tuxedo) అనునది ప్రాచ్యులవిందులలో అనుచితమగురీతి ప్రాచ్యదేశీయ కళా విన్యాసమున పరిపూర్ణముగాను, ఆనంద సంజనకముగాను, అనర్గళముగాను, స్వీయభావములను ఆవిష్కరించుపట్ల పాశ్చాత్య కళారీతులను అవలంబించుట అనుచితమగును. శిథిలములయిన ప్రాచీన భారతీయ చిత్రకళా సంప్రదాయ తంతువులను గుమిగూర్చుటచేతను, జాతీయము లయిన వ్యవస్థల యొక్కయు, సంకల్పముల యొక్కయు, శక్తిని పునరుద్ధరించుట చేతను, దేశీయ కళాలక్ష్మికి మోక్షము సిద్దింపగలదని మొట్టమొదట గ్రహించినవాడు
అవనీంద్ర ఠాకురే.
అవనీంద్రనాథ ఠాకురు అనేకరీతుల అసదృశమైన వ్యక్తిత్వము కలవాడు. పారమార్థిక జీవితము అను దేవాలయము నందు ఒక ప్రత్యేకమైన గూడుగా విరాజిల్లుచున్న సమకాలిక సంస్కృతియందు అతడు ఎల్లప్పుడును ఒక ప్రముఖస్థానము నాక్రమించి యుండగలడు. భారతదేశముయొక్క అన్యప్రాంతములలో అపుడపుడు ప్రదర్శింపబడుచుండు ఆతని చిత్రములు అతని చిత్రకళా కౌశలమునకు సరియగు నిదర్శనములు కావు. (అతని ఉత్తమోత్తమ చిత్రము లింకను ప్రచురింపబడ లేదు.) అతడు మోటుగను, సరికాని వర్ణములతోను, రచించి ముద్రింపించిన హాఫోటోన్సు చిత్రములే అందరెరిగినవి. అట్టి చిత్రములు వివాదోపశమముకంటె వివాదోత్పత్తికే, గుణగ్రహణముకంటే దోషావిష్కరణమునకే విశేషముగా సాధనము లయ్యెను. ఠాకురు సంచార విముఖుడు. గృహము నాశ్రయించియుండు నలవాటు కలవాడు. ఆంగ్లేయ భాషలో వ్రాయుటకు సమ్మతి లేనివాడు. అందుచేత అసాధారణ సౌందర్యము, గౌరవము కలిగి, సౌందర్య రసగ్రహణ పారీణుడయి, భారతీయ కళయందు అత్యంత ప్రతిభాన్వితుడయిన అతనితో భారత దేశమునందలి ఇతర ప్రాంతములందుండు నాగరక శిఖామణులకు పరిచయ భాగ్యము లభించుట సాధ్యపడదయ్యెను.
ప్రాచ్యఖండమునందలి ప్రాచీన విద్వద్వర్యులచే గ్రంథస్థము చేయబడి, పరిపుష్టమై, పాశ్చాత్య కళకు ఏవిధమున తీసిపోక, అత్యంత వికాస భాసురమై సంపూర్ణముగ ఉపజ్ఞాయుతమై, సౌందర్య మీమాంసా విషయకమైన భాషను ఠాకురు కనిపెట్టెను. ఇట్టి ఆవిష్కరణములో లారెన్సు బన్యన్, రోజర్ ఫ్త్ర్ అను విమర్శకులు కనిపెట్టిన విషయములను బహు సంవత్సరములకు ముందుగనే డాక్టరు అవనీంద్రనాథ ఠాకురు కనిపెట్టినవా డయ్యెను. చీనా, జపాను దేశములకు సంబంధించిన అనేక కళారూపములకు పెక్కు భంగుల భారతదేశమే గురుత్వమును పూర్వ భావిత్వమును కలిగి యుండెను. ఖజిల్(Qyzyl) హూరియోజి (Horioji) ప్రాంతమునందలి .ఫ్రెస్కోస్ (తడిగోడలపై చిత్రించు రంగు బొమ్మలు) సాక్షాత్తుగా భారతీయ చిత్రానుకరణములై యున్నవను విషయమును డాక్టరు ఠాకురు తాను సంపాదించిన పెక్కు చిత్రకళా ఖండములనుబట్టి ధ్రువపరచెను.
1897 వ. సంవత్సర ప్రాంతమున అవనీంద్రనాథ ఠాకురు ఇరువదియైదు సంవత్సరముల ప్రాయమున నుండి ఇటాలియను కళావేదియగు సీనారు, గిల్ హార్డి యొద్దను, పిదప కలకత్తా నగరమునందలి దొరతనము వారి చిత్రకళాశాల యొక్క ఉపప్రధానాధికారి యొద్దను ఛాయావిశేష చిత్రణములు, రూపచిత్రణములు, వర్ణ చిత్రణములు, పరిపూర్ణాకార వివరణ చిత్రణములు మున్నగువాటిని అభ్యసించెను. పిదప ఇంగ్లండునుండి ఏతెంచిన చార్లెసు ఎల్ పామరు అను కళా వేది యొక్క చిత్రకళామందిరమున పాఠముల నభ్యసింపనారంభించెను. ఇట్లు ఠాకురు మూడునాలుగు సంవత్సరముల పర్యంతము పామరువద్ద గాఢమయిన శిక్షణము నొందిన పిదప