Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంకగణితము పై (2) విలోమ విధానము:- ఇందు పై లెక్కనే మూడు విధములుగా చూపవచ్చును. (i) 625 గుణ్యము 15 గుణక ము ఉదా : 625×15=9375 6+2+5ను 9 చే భాగించిన మిగులు శేషము =4 1+5

6×4ను,,

" 6 =0 " " మరియు, 9+3+7+5,, " =6 625 3125 9,375 లబ్ధము. (ii) 1x6 6 1×2 2 1x5 5x6 3 0 5×2 1 5×5 లబ్ధము -- 9 3 (iii) 625 15 S ☐ 0 2 5 7 3 6 2 5 3 2. 5 0 3 7 5 5 ఇట్టి లబ్ధమునందలి తప్పొప్పులను కనుగొనుటకు ఒక సూత్రము చాలకాలము క్రిందనే మన పూర్వులు ఉప యోగించెడివారు. నేటి గణితశాస్త్రజ్ఞులును వాడుచున్నారు. అది ఎట్లన : దానినే గుణ్యమునందును గుణకమునందును గల అంకెల మొత్తములను, చే భాగించగా లభించు శేషముల లబ్ధమునుగూడ 9 చే భాగించిన వచ్చు శేషమును, గుణ్య గుణకముల లబ్ధములోగల అంకెల మొత్తమును 9 చే భాగించగావచ్చు శేషమును, సమానములైనచో లభించిన లబ్ధము ఒప్పు. 4 రెండు సమానములు. కావున వచ్చిన లబ్ధము ఒప్పు. వేసియోలి (Pacioli క్రీ. శ. 1494) అను గణిత శాస్త్రజ్ఞుడు గుణకారమున ఎనిమిది మార్గములు చూసే నట. వ్యవకలనమును పెక్కుసారులు ఉపయోగించుటచే భాగహారమును సాధించుట మన పు ర్వీకులనుండి సంక్ర మించిన పద్ధతి. సగము చేయుట (Mediation), చుట (Duplication) మనకు పూర్వీకులనుండి లభించిన పద్ధతులే. ఏదైన ఒక రాశిని సున్నచే భాగించినపుడు లబ్ధము అనంతమగు నని భాస్కరుడు స్పష్టముగ వచించియుండుట మనము గమనింపదగిన విషయము. పాశ్చాత్య సిద్ధాంత ముల ప్రకారము, బీజగణిత వ్యవహారములను బట్టియే అనగా సమీకరణములతోనే చేయదగిన లెక్కలు, కొన్ని అంకగణిత సూత్రముల సహాయముచేత మాత్రమే, భాస్క రాచార్యుని లీలావతీ గణితమున, చేయబడి యుండుట, అంకగణితమున మన పూర్వులకుగల ప్రజ్ఞను తెలుపును. నిత్యకృత్యములయందు అంకగణితమువలె ఉపయోగ పడు శాస్త్రము వేరొక్కటిలేదు. లోక వ్యవహారమునకు ప్రతి మానవునకును కొంచెమో, గొప్పయో అంకగణిత జ్ఞాన మవసరము. వడ్డీ లెక్కలు, హుండీల మారకము, వినిమయము (Exciange), ఉమ్మడి వ్యాపారము, లాభ నష్టములు - ఇవి నిత్యవ్యవహారములందు ఉపయోగించు లెక్కలు కేవలము కేవలము శాస్త్రజ్ఞానమును బట్టియేగాక యు క్తి చేతను, ప్రపంచజ్ఞానము మొదలగు వాటి వలన చేయ దగిన లెక్కలు గూడ గలవు. ఇట్టి యుక్తి లెక్కల నిచ్చి చేయు మనుట ప్రాచీనులనుండి వచ్చిన యలవాటు. లెక్కలు చేయు యంత్రములు మానవుని బుద్ధిబలము వలన చేయవలసిన అంకగణిత క్రియల నన్నిటిని లెక్కలు చేయుయంత్రము సులభముగా చేయును. ఇచ్చిన అంకెలను