Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్యజానాత్ సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము

అంకగణితము — గణితశాస్త్రములలో నెల్ల అంకగణితము మిక్కిలి పురాతనమైనది. పూర్వ మిది సాంఖ్యసిద్ధాంతముగా పరిగణింపబడుచుండెడిది. కాల క్రమమున సాంఖ్యసిద్ధాంత మొక ప్రత్యేక శాఖ యైనందున నేడు అంకగణితము, గణనక్రియకు, దాని అను ప్రయోగములకు సంబంధించినదిగా గుర్తించబడుచున్నది. సంఖ్యాక్రమ విధానము: ప్రాచీనజాతులవా రందరును మొట్టమొదట వేళ్ళలోనే లెక్కపెట్టెడివారు. సంఖ్యలను మాటలవలన తెలి పెడివారు. అంకములకు, సంఖ్యలకు ప్రత్యేక గుర్తులు లేకుండ పదములలో నే వ్రాయుచుండి నచో, గణితశాస్త్రమే సంకుచితమై యుండెడిది. కనుక నే అంకములకు చిహ్నముల నేర్పరచు ఆవశ్యకము గల్గినది. చరిత్రకు తెలిసినంతవరకు సంఖ్యలను వ్రాయుటలో "ఫినీషియను" పద్ధతి మిక్కిలి పురాతనమయినది. వారు తొమ్మిదివరకు అంకెలను నిలువు గీతలచే తెలి పెడివారు. మన మిప్పటికిని కొన్ని నిర్దిష్ట కార్యములకై వాడు రోమను సంఖ్యలు, రోమనులు సంఖ్యాక్రమ నిరూపణ మున గ్రీకులమార్గము నవలంబింపక వేరొక త్రోవ త్రొకిరి అని తెలుపును. రోమనుల సంఖ్యాసం కేతము లివి : I, II, III IV, V, VI, VII, VIII, IX, X, L, C, D, M. 1, 2, 3, 4, 5, 8, 7, 8, 9, 10, 50, 100, 500, 1000.

హిందువుల సంఖ్యాస్వరూపము (System of Notation) తదితర జాతులవారిదానికంటే భిన్నము. అంకగణిత మున హిందువులు అత్యంతపురాతన కాలమున నే మిక్కిలి పరిశ్రమ చేసిరి. క్రీ.శ. 12వ క్రీ. శ. 12 వ శతాబ్దినాటికే హిందువులు నవీన అంకగణితసారము నంతయు గ్రహించిరి. సంఖ్యావళియందు స్థాన భేదమును, సంఖ్యలేనిచోట సున్న పెట్టుటయు, సంఖ్యాతత్వ నిరూపణమునందు ధన, ఋణ సంఖ్యాభేదములును, కరణి, వికరణ్యంక (Irrational and rational quantities) వివక్షయు, మొట్టమొదట కను గొన్నవారు హిందువులే. 11 వ శతాబ్ది ఆరంభమున అల్బెరూని యను మహమ్మదీయ చరిత్రకారుడు హిందు వుల సంఖ్యావిధానమునుగురించి వ్రాయుచు, హిందూ దేశమున సంఖ్యావళిలో లి అంకెలును, ఒక సున్న యు నుండి, స్థానమునుబట్టి యేదేవి యొక సంఖ్య యొక్క మొత్తము పది రెట్లు హెచ్చుటగాని, తగ్గుటగాని కలదని వ్రాసియుండెను. మన దేశమున క్రీ. శ. 876లో సున్న వాడుకలో నున్నట్లు నిదర్శనములు గలవు. సంఖ్యాక్రమ మున మనము వాడు అంకెలను గురించి, క్రీ. శ. 662 లోనే సిరియా దేశస్థుడగు సెవేరస్ సె బోల్తు అను నతడు ఇతర దేశములకు వెల్లడిచేసి యుండుట గమనింపదగినది.

సంఖ్యావళియందున్న అంకెలకు రెండర్థములుగలవు. మొదటిది అంకెల యొక్క గుర్తునుబట్టి కలుగుచున్నది. అనగా "4" అను సంకేతమునకు, "నాలుగు” అను అర్థము గుర్తువలన దెలియుట. ఇయ్యది సాం కేతి కార్థము. ఇక రెండవ అర్ధము, ఈ యం కెలకే, స్థానభేదమువలన గలుగుచున్నది.

ఉదా : '5' గుర్తునకు ఐదని సాంకేతికార్థము. కాని '52' అను అంకములో, 'ఐదు' నకు స్థానమును బట్టి యేబది యను అర్థము కలుగుచున్నది. ఇట్లొక్కొక్క స్థానము హెచ్చిన కొలది, అంకెయొక్క విలువ పది రెట్లు చొప్పున హెచ్చుచుండును. మన సంఖ్యాక్రమమునందు