Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమెరికా సంయుక్తరాష్ట్రములు (చరిత్ర) ముల యొక్క ప్రోద్బలమువలన కాదు. ఇచ్చట వలసలు ఏర్పడిన తరువాతకూడ ఆంధ్రదేశ ప్రభుత్వము కాని మరి యితరదేశ ప్రభుత్వములు కాని యిక్కడి ప్రజల యొక్క స్థితిగతులతో ఎక్కువజోక్యము కలిగించుకొనలేదు. అందు వలన ఈవలస రాష్ట్రముల ప్రజలలో స్వాతంత్ర్యబుద్ధి, మాతృదేశము నెడల ఒక విధమైన నిర్లక్ష్యము బయలు దేరెను. 18వ శతాబ్ది మూడవ పాదములో ఫ్రెంచి ఈ ప్రాంతమునుండి తరిమి వేసిన గ్లప్రభుత్వము ఈ వలసలమీద అధికారము నెరపుచు ఒక విధ మైన క్రొత్త సామ్రాజ్య దృక్పథము అలవరచు కొనెను. మొదటినుండియు స్వాతంత్ర్యమునకు అలవాటు పడిన ఈ వలసలలోని ప్రజలు ఈ మార్పును గర్హించిరి. క్రమ క్రమముగా ఆంగ్ల ప్రభుత్వము వలస రాష్ట్ర BC ముల పరిపాలనకు అగు వ్యయములు వలసవా రే ధ రింప వలెనను తత్త్వ మును అనుసరింపగా వలస రాష్ట్రప్రజలుతమకుప్రాతి నిధ్యములేని బ్రిటిష్ పార్ల మెంటు విధించు పన్నులు తామెందులు కీయవలెనని వాదింపసాగిరి. ఈ సంఘ మహా సముద్ర ము అమెరికా తరువాత క న డా సంయుక్త రాష్ట్రములు ర్షణము నానాటికి తీవ్ర రూపముడాల్చి క్రీ. శ. 1775 వ సంవత్సరములో ఇంగ్లాండునకును వలసరాజ్యములకును మధ్య ఒక యుద్ధముగా పరిణమించెను. దీనికే అమెరికా స్వాతంత్య్ర యుద్ధము అని పేరు. జార్జివాషింగ్టన్ నాయకత్వమున వలసల వారు 8 సంవత్సరముల కాలము హోరాహోరిగ పోరాడి తుదకు క్రీ. శ. 1788 లో విజయముపొంది తమ స్వాతంత్ర్యమును సంపాదించుకొనిరి. స్వాతంత్ర్యము లభించిన తరువాత దాని నేవిధముగ నిలువబెట్టుకొనవలయు ననునది ప్రధాన సమస్య యయ్యెను. అదియును కాక యీ వలసలలో, యీ పరస్ప రము ఏ విధమైన సంబంధము ఉండవలెనో కూడ నిర్ణ యించుకొనవలసి వచ్చెను. క్రీ. శ. 1787వ సంవత్సరమున 286 ఫిలడెల్ ఫియాలో ఈ వలసల ప్రతినిధులు సమా వేశమై ఒక రాజ్యాంగ ప్రణాళికను తయారుచేసి ఆమోదించిరి. ఈ ప్రణాళికలో స్థానిక స్వాతంత్ర్యము సాముదాయిక మగు అధికారము అను రెండు భిన్నసూత్రములు సమన్వ యింపబడినవి. సాముదాయిక అధికారము కాంగ్రెసు అను శాసనక ర్తృత్వమునకు వశముచేయబడెను. ఈ సంస్థ లో రాష్ట్రములకు ప్రాతినిధ్యము వహించు సెనేటు అనియు, మొత్తము ప్రజలందరికి ప్రాతినిధ్యము వహించు ప్రజాప్రతినిధి సభయనియు, రెండు విభాగములు ఏర్పరచ బడెను. ఈ విధముగా ఏర్పడిన సంయుక్త రాష్ట్రములకు యుద్ధములో విజయమునకు కారుకుడైన జార్జి వాషింగ్ టన్ మొదటి అధ్యక్షుడుగా ఎన్నుకొనబడెను. రాజ్యము సింధు శాఖ అట్లాంటిక్ మహా సముద్రము స్వాతంత్ర్యము ను సంపాదించుకొని ఒక రాజ్యాంగమును ఏర్పర చుకొనిన తరువాత అర్ధ శతాబ్దికాలములో అమె రికా సంయుక్త రాష్ట్ర ముల చరిత్ర సంస్కృతు లలో చాల ముఖ్యమగు మార్పులు వచ్చెను. దేశ ములో ప్రభుత్వము సుస్థి రమై, పరిశ్రమలు, వాణి రాజ్యము, వ్యవసాయము అభివృద్ధి చెందెను. క్రమ క్రమముగా ఈ సంయుక్త రాష్ట్ర ములు పడమటగా వ్యాపించసాగెను. దీనిఫలితముగా క్రీ.శ. 1821 వ సంవత్సరము నాటికే మరి ఆరు క్రొత్త రాష్ట్రములు ఈ సమాఖ్యలో చేరుటయు ఒక క్రొత్త జాతీయభావము ఏర్పడుటయు జరిగెను. కేంద్రము యొక్క అధికారము ఎక్కువగా ఉండవలెనని 'హేమిల్ టన్ నాయకత్వమున ఒక పక్షమును, రాష్ట్రములకు ఎక్కువ అధికారముండవలెనని చెఫర్ సన్ నాయకత్వ మున మరియొక పటమును బయలుదేరగా వాదోపవాద ములు సాగెను. ఈ కాలములోనే వాఙ్మయము అభివృద్ధి పొంది దేశము యొక్క సాంస్కృతిక వ్యక్తిత్వమునకు దోహద మొనం గెను. పారిశ్రామికుల స్థితిగతులలో అభి