Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికా ఖండము - ఉత్తరము (భూగోళము)


అనునవి ఈ ద్వీప సమూహమునందలి ఇతరద్వీపములు. ప్రసిద్ధములైన పడమటి ఇండియాదీవులు, కరివియన్ సముద్రమునందలి ద్వీపసమూహములు, క్వీను ఛార్లొటి, వాంకూవరు ద్వీపములు పసిఫిక్ తీరమునకు ఎదురుగా ఉన్నవి. అలాస్కా, కాలిఫోర్నియా, మెక్సికో, లారెన్సు, సింధుశాఖలును, హడ్సను అఖాతమును ఖండముతీరము లోనికి చొచ్చుకొసిపోయిన ప్రధాన జలభాగములు.

భౌతిక స్వరూపము  : ఉత్తర అమెరికా ఖండమును (1) పసిఫిక్ పర్వతపంక్తి (2) తూర్పు ఉన్నతభూములు (3) మధ్య మైదానములు అని మూడుభాగములుగా